తెలుగుగంగ ఆయకట్టు రైతుల సంక్షేమానికి కృషి
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:36 PM
తెలుగుగంగ ఆయకట్టు రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.

ఆళ్లగడ్డ(శిరివెళ్ల), డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి) : తెలుగుగంగ ఆయకట్టు రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టు కమిటీ చైర్మనగా ఏకగ్రీవంగా ఎన్నికైన చెన్నారెడ్డిగారి సంజీవ కుమార్‌రెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. రైతులకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ తెలుగుగంగ చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడమే ధ్యేయంగా పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో తెలుగుగంగ ప్రాజెక్టును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పీసీ చైర్మన సంజీవ కుమార్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెన్నారెడ్డిగారి జనార్ధనరెడ్డి(గంగవరం చెరువు అధ్యక్షుడు), చెన్నారెడ్డిగారి అశోక్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన ఏపీపీ :
ఆళ్లగడ్డ 5వ అదనపు జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా(ఏపీపీ) నియమితులైన న్యాయవాది బత్తిన శివ ప్రసాదరావు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా, పూలమాలలతో ఎమ్మెల్యేను సన్మానించారు. పేదలకు న్యాయ సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది రమణయ్య, మల్లికార్జునరెడ్డి, రఘునాథరెడ్డి, సుదర్శన పాల్గొన్నారు.