Share News

ఎస్సార్బీసీ అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Dec 31 , 2024 | 11:16 PM

బనగా నపల్లె, పాణ్యం, నియోజకర్గాల పరిధి మండలాల్లోని ఎ స్సార్బీసీ ప్రాజెక్టు పరిధిలోని పంట కాల్వలు, ప్రధాన కా ల్వల మరమ్మతుల కోసం తన వంతు కృషి చేస్తామని ఎ స్సార్బీసీ ప్రాజెక్టు చైర్మన కాట్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.

 ఎస్సార్బీసీ అభివృద్ధికి కృషి
సమావేశంలో మాట్లాడుతున్న కాట్రెడ్డి

- ఎస్సార్బీసీ ప్రాజెక్టు చైర్మన కాట్రెడ్డి

బనగానపల్లె, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): బనగా నపల్లె, పాణ్యం, నియోజకర్గాల పరిధి మండలాల్లోని ఎ స్సార్బీసీ ప్రాజెక్టు పరిధిలోని పంట కాల్వలు, ప్రధాన కా ల్వల మరమ్మతుల కోసం తన వంతు కృషి చేస్తామని ఎ స్సార్బీసీ ప్రాజెక్టు చైర్మన కాట్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని జిల్లెళ్ల గ్రామంలో ఆయన విలేకర్లతో మా ట్లాడుతూ తాను ఎస్సార్బీసీ ప్రాజెక్టు చైర్మనగా ఎన్నిక య్యేందుకు సహకరించిన రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన రెడ్డికి, ఎస్సార్బీసీ ప్రాజెక్టు పరిధిలోని సభ్యుల కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేయనున్నట్లు తెలిపారు. మంత్రు లు బీసీ జనార్దనరెడ్డి, ఫరూక్‌, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత సహకారంతో నిధులు తీసుకువచ్చి అధ్వాన స్థితిలో ఉన్న ఎ స్సార్బీసీ ప్రధాన కాల్వ లకు, ఎస్సా ర్బీసీ పంట కాల్వల అభి వృద్ధికి కృషి చేస్తామన్నా రు. ఎ స్సార్బీసీ అధి కారుల సాయంతో ఎస్సార్బీసీ కాల్వలను మరమ్మతు చేయించి రైతులకు సేవలందిస్తామన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 11:16 PM