Share News

నేడు రాష్ట్రంలో గాలివాన

ABN , Publish Date - Jun 09 , 2024 | 03:10 AM

: నైరుతి రుతుపవనాలు శనివారం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దక్షిణ ఒడిశాలో కొన్ని ప్రాంతాలకు, ఉత్తరాంధ్రలో కొద్దిభాగం వరకూ విస్తరించాయి.

నేడు రాష్ట్రంలో గాలివాన

బలంగా రుతుపవన కరెంట్‌

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక

విశాఖపట్నం, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు శనివారం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దక్షిణ ఒడిశాలో కొన్ని ప్రాంతాలకు, ఉత్తరాంధ్రలో కొద్దిభాగం వరకూ విస్తరించాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, తూర్పు-పడమరగా విస్తరించిన ద్రోణి దక్షిణ కోస్తా మీదుగా పయనిస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల శనివారం వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్‌ బలం గా ఉండడంతో కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Updated Date - Jun 09 , 2024 | 03:10 AM