Share News

వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కేనా..!

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:01 AM

సీఎం జగన్మోహన్‌రెడ్డి పిట్టలదొరలా మాట్లాడడం దురదృష్టకరం. బెండపూడి ఇంగ్లీష్‌ యాసలో విశాఖపట్నమే రాష్ట్ర రాజధానని పేర్కొనడం హాస్యాస్పదం’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కేనా..!

విశాఖే రాజధాని అనడం హాస్యాస్పదం

ఓటమి భయంతో రెచ్చిపోతున్న పేటీఎం కూలీలు: రఘురామరాజు

న్యూఢిల్లీ, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ‘సీఎం జగన్మోహన్‌రెడ్డి పిట్టలదొరలా మాట్లాడడం దురదృష్టకరం. బెండపూడి ఇంగ్లీష్‌ యాసలో విశాఖపట్నమే రాష్ట్ర రాజధానని పేర్కొనడం హాస్యాస్పదం’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. విశాఖపట్నంలోనే మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానన్న జగన్‌కు రానున్న ఎన్నికల్లో అసలు ప్రతిపక్ష నేత హోదా అయినా దక్కుతుందా? అని ప్రశ్నించారు. మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘పొలాల్లో ఏనుగులు వచ్చి పడినప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో, ఇప్పుడు విశాఖవాసుల పరిస్థితి అలా ఉంది. ఏనుగులే మేము వస్తున్నామని ప్రకటించిన తరువాత, ఇప్పుడు విశాఖ వాసుల పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే, ఇటీవల వచ్చిన ఓ తెలుగు సినిమాలో ‘కుర్చీ మడత పెట్టి...’ అనే పాట గురుకొస్తోంది. వైసీపీకి ఓటమి తప్పదన్న భయంతో మళ్లీ పేటీఎం కూలీలు రెచ్చిపోతున్నారు. నరసాపురంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులకు 70ు ఓట్లు పోలవడం ఖాయం. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలలో ఎక్కడా 60 శాతానికి తగ్గే అవకాశం లేదు. ఎన్నికల కోడ్‌ ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఈ పనికిమాలిన పరిపాలకుడిని వదిలించుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు’ అని రఘురామ అన్నారు. ‘పోలవరం ప్రాజెక్టును ఆపేస్తారా? అమరావతి రోడ్లను తవ్వేసి కంకర, మట్టి అమ్ముకుంటారా? ప్రజాధనం రూ.500 కోట్లు వెచ్చించి ప్యాలెస్‌ నిర్మించుకుంటారా? అని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రాజెక్టులు కట్టేవారు కావాలా? సొంత ప్యాలె్‌సలు నిర్మించుకునేవారు కావాలా? ఆలోచించి, ప్యాలెస్‌ ప్రభుత్వాన్ని సమాధి చేయాలి. ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వాన్ని తీసుకురావాలి’ అని రఘురామ విజ్ఞప్తి చేశారు.

Updated Date - Mar 06 , 2024 | 04:01 AM