Share News

పిలిస్తే ప్రచారానికి వస్తా: జయప్రద

ABN , Publish Date - Apr 04 , 2024 | 04:13 AM

నాకు పవన్‌ కల్యాణ్‌, బాలయ్య అంటే చాలా ఇష్టం. అలాగే చంద్రబాబు అంటే ప్రత్యేకమైన గౌరవం.

పిలిస్తే ప్రచారానికి వస్తా: జయప్రద

తిరుమల, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): ‘నాకు పవన్‌ కల్యాణ్‌, బాలయ్య అంటే చాలా ఇష్టం. అలాగే చంద్రబాబు అంటే ప్రత్యేకమైన గౌరవం. వారు పిలిస్తే తప్పకుండా ఎన్నికల ప్రచారానికి వస్తా’ అని ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆమె బుధవారం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అవకాశం ఇస్తే ఏపీ నుంచి పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలనుందని తెలిపారు. ఇక్కడ టికెట్‌ ఇవ్వలేదంటే అధిష్ఠానానికి ఇంతకంటే మంచి ఆలోచన ఉండి ఉండవచ్చన్నారు.

Updated Date - Apr 04 , 2024 | 08:15 AM