Share News

ఇప్పుడెందుకు ఉద్యమం..?

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:49 AM

గత ఎన్నికలకు ముందు హామీలు గుప్పించి.. గెలిచిన తర్వాత నిలువునా మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి గట్టి షా క్‌ ఇచ్చేందుకు ఉద్యోగులు ‘సిద్ధం’ అయ్యారు.

ఇప్పుడెందుకు ఉద్యమం..?

ఐఆర్‌ కూడా అడగొద్దులే..!

ఇప్పటి వరకు ఏమీ ఇవ్వని ఈ ప్రభుత్వానికి.. ఎన్నికల ముందు క్రెడిట్‌ ఇవ్వొద్దంటున్న ఉద్యోగులు

ప్రధాన జేఏసీ సమావేశాల్లో జిల్లా నేతలకు వెల్లడి

విజయవాడ, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): గత ఎన్నికలకు ముందు హామీలు గుప్పించి.. గెలిచిన తర్వాత నిలువునా మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి గట్టి షా క్‌ ఇచ్చేందుకు ఉద్యోగులు ‘సిద్ధం’ అయ్యారు. ఉద్యోగు ల సమస్యల పట్ల నాలుగున్నరేళ్లు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన ఈ ప్రభుత్వాన్ని.. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇక ఏమీ అడగొద్దని.. ఉద్యోగ సంఘాల నేతల మీద ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం ఏమీ చేయదని ఫిక్స్‌ అయిపోయిన ఉద్యోగు లు.. ఎన్నికల ముందు విదిల్చే మెతుకుల కోసం ఈ ప్రభుత్వానికి క్రెడిట్‌ ఇవ్వకూడదని భావిస్తున్నారు. విజయవాడ వేదికగా 2 రోజుపాటు అటు ఏపీజేఏసీ అమరావతి, ఇటు ఏపీజేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలతో పాటు ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌(ఏపీఆర్‌ఎ్‌సఏ), ఏపీఎన్‌జీజీవో అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఉద్యోగుల నుంచి వస్తున్న అభిప్రాయాలను ఆయా సంఘాల జి ల్లాల నేతలు అగ్రనేతల దృష్టికి తీసుకురావడం చర్చనీయాంశంగా మారుతోంది. మొన్నటి వరకు తమ నుంచి మద్దతు ఉన్నా.. అగ్రనాయకులు ఉద్యమాన్ని సరిగా నడిపించలేదన్నది ఉద్యోగుల అభిప్రాయం. అయితే ఇప్పుడు సడెన్‌గా ప్రభుత్వాన్ని ఏమీ అడగవద్దు అనే దిశగా ఉద్యోగులు ఎందుకు వెళ్లారన్నది చర్చనీయాంశమైంది. ఎన్నికల కొద్ది రోజుల ముందు ఆందోళన చేసి అరాకొర సాధించుకుందామన్న అగ్రనేతల ఆలోచనకు కూడా ఉద్యోగులు సహకరించడం లే దు. ఈ నెలలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటపుడు ఉద్యోగుల మెప్పు కోసం, ప్రభుత్వం ఏదో చేసేసిందన్న భావన కల్పించడం కోసం ప్రధాన జేఏసీల అగ్ర నాయకత్వాలు డ్రామాలు ఆడుతున్నాయన్న భావనకు ఉద్యోగులు వచ్చారు. రెం డు రోజులుగా జరుగుతున్న జేఏసీ సమావేశాలే దీనికి నిదర్శనం. ఆయా జిల్లాల నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఏమీ ఇవ్వదనేది ఉద్యోగులలో బలంగా నాటుకుపోయిందని, ఇప్పుడేం అడిగినా ప్రయోజనం లేదని తమతో చెబుతున్నట్టుగా అగ్రనేతల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అగ్రనేతలు సైతం కంగుతిన్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వానికి ఎన్నికల ముందు ఒకటి, రెండు క్రెడిట్స్‌ కూడా ఇవ్వవద్దనేది జిల్లా నేతల అభిప్రాయంగా వ్యక్తమైంది.

లోపాయకారీ ఒప్పందం..?

ప్రధాన జేఏసీ నాయకులిద్దరితో ప్రభుత్వం లోపాయికారీ 3 అంశాలపై హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఐఆర్‌ 7 శాతం, పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ 10 శాతం పెంపుదల, ఒక్క డీఏ ఇచ్చేలా హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో జేఏసీల అగ్రనాయకత్వాలు ఉద్యోగుల నుంచి డిమాండ్‌ లేకపోయినా.. ఉద్యమం పేరుతో నాటకానికి తెరలేపుతున్నారని ఉద్యోగులకు సమాచారం ఉంది. ఉద్యమం పేరుతో కార్యాచరణ ప్రకటిస్తే.. ప్రభుత్వం లోపాయికారీగా ఇచ్చిన హామీలను తమ ఘనతగా చెప్పుకోవచ్చని, అదే సమయంలో సర్కారు పట్ల కొంత సానుకూల స్పందన తెచ్చే ప్రయత్నాలు చేయవచ్చన్నది అగ్రనేతల ఆలోచనగా ఉందని ఉద్యోగులే జిల్లాల నేతల దగ్గర ప్రస్తావిస్తున్నారు. వారు అదే విషయాన్ని అగ్రనేతలకు వివరించటంతో వారు ఖంగు తింటున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 03:49 AM