పెత్తందారు ఎవరు?
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:56 AM
ఈ ఎన్నికలు పెత్తందారుకు, పేదవాడికి మధ్య జరుగుతున్న యుద్ధమని ప్రచారంలో ఊదరగొట్టిన జగన్.. తమకు మాత్రం గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని వైసీపీ నేతలు వాపోతున్నారు.

వైసీపీ నేతలను నిలబెట్టే మాట్లాడిన జగన్
రాజకీయ వర్గాల విమర్శలు
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): ఈ ఎన్నికలు పెత్తందారుకు, పేదవాడికి మధ్య జరుగుతున్న యుద్ధమని ప్రచారంలో ఊదరగొట్టిన జగన్.. తమకు మాత్రం గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని వైసీపీ నేతలు వాపోతున్నారు. గురువారమిక్కడి తాడేపల్లి ప్యాలె్‌సలో తన పార్టీ ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. తాను మాత్రం కుర్చీలో కూర్చుని టేబుల్ ముందు నాలుగు కుర్చీలు వేయించారు. దాదాపు 35 మంది నేతలు రాగా.. ఆ నాలుగు కుర్చీల్లో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, కౌన్సిల్ చైర్మన్ మోషేన్‌రాజు, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ జకియాఖాన్ కూర్చున్నారు. ఇక తిరుపతి, అరకు ఎంపీలు గురుమూర్తి, తనూజారాణి, అరకు, పాడేరు ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, మత్సరాస విశ్వేశ్వరరాజు, మాజీ మంత్రులు విడదల రజిని, జోగి రమేశ్, ఉషశ్రీ చరణ్, కారుమూరి నాగేశ్వరరావు, కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్‌కుమార్, ప్రసాదరాజు, ఓడిన నేతలు కారుమూరి సునీల్, దేవినేని అవినాశ్ తదితరులంతా ఆయన ఎదుట నిలబడ్డారు. ఎవరు పెత్తందారో ఆయన ప్రవర్తనే తెలియజేస్తోందని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.