Share News

విత్తనాలు ఎప్పుడిస్తారు..?

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:04 AM

ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు కురుస్తాయనీ, వ్యవసాయ పొలాలను దుక్కు దున్కుఉని రైతులు సిద్దం చేసుకున్నారన్నారు.

విత్తనాలు ఎప్పుడిస్తారు..?

మద్దికెర, జూన్‌ 3: ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు కురుస్తాయనీ, వ్యవసాయ పొలాలను దుక్కు దున్కుఉని రైతులు సిద్దం చేసుకున్నారన్నారు. విత్తనాలు ఎప్పుడు ఇస్తారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. సోమవారం స్థానిక ఆర్‌బీకే కేంద్రం ముందు విత్తనాల కోసం ఎదురు చూశారు. ఈ సందర్బంగా వ్యవసాయాఽశాఖ అధికారి రవితో మాట్లడుతూ రెండు రోజులు మాత్రంం విత్తనాలు సరఫరా చేసి పంపిణీ చేయకపోతే ఎలా అని ్పశ్ర్నించారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల విత్తనాలు నిల్వ లేవని, బయట కొందామంటే.. నాసీరకం విత్తనాలు ఇస్తారనీ అన్నారు. కేవలం ఒక్కరోజులోనే విత్తనాలు పంపిణీ చేసి మాకు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఏవో మాట్లాడుతూ జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విత్తనాలు పంపుతామని తెలపడం జరిగతిందన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 12:04 AM