Share News

దళితులకు సామాజిక సమానత్వమేది?

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:05 AM

స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా... దళితులు సామాజిక సమానత్వానికి నోచుకోలేదని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

దళితులకు సామాజిక సమానత్వమేది?

ఆదోని రూరల్‌, జూన్‌ 3 : స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా... దళితులు సామాజిక సమానత్వానికి నోచుకోలేదని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో కేవీపీఎస్‌ ఉపాధ్యక్షుడు కడితోట దావీదు ఆధ్వర్యంలో దళితుల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ దళితులు కులవివక్షతను ఎదుర్కొంటున్నారన్నారు. చైతన్యం, పోరాటంతో మాత్రమే వాటిని తిప్పికొట్టగలమన్నారు. ఈనెల 28,29వ తేదీలలో ఆదోనిలో సామాజీక చైతన్య శిక్షణ తరగతులు ఉంటాయని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిక్కప్ప, మల్లికార్జున, యువరాజు, లక్ష్మన్న, చక్రవర్తి పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 12:05 AM