Share News

ఏమిటీ.. ఎస్మా?

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:22 AM

అంగన్వాడీలపై జగన్‌ సర్కారు పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా ఎస్మా అస్ర్తాన్ని ప్రయోగించింది. తద్వారా వారిని కట్టడి చేయాలని నిర్ణయించింది.

ఏమిటీ.. ఎస్మా?

నేరశిక్షాస్మృతితో సంబంధం,

వారెంట్‌ లేకుండానే అరెస్టు, జైలు!

అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీలపై జగన్‌ సర్కారు పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా ఎస్మా అస్ర్తాన్ని ప్రయోగించింది. తద్వారా వారిని కట్టడి చేయాలని నిర్ణయించింది. ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశంమైంది. ఈ నేపఽథ్యంలో అసలేమిటి ఎస్మా చట్టం, ఎస్మా ప్రయోగిస్తే ఏమవుతుందన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఎస్మా అంటే ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌(అత్యవసరర సేవల నిర్వహణ చట్టం). బంద్‌ లేదా హర్తాళ్లు వంటివి చేయడం వల్ల ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడడం, కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణకు ఆటంకం లేకుండా కొనసాగేలా చూడడం కోసం 1981లో దీన్ని రూపొందించారు. అత్యవసర సేవలందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా, ఆయా సేవల కు విఘాతం కలిగేలా సమ్మె చేస్తే దీన్ని ప్రయోగిస్తారు. 1980లో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికి పోయింది. కార్మిక చట్టాల్లో మార్పులు తేవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఉద్యమించాయి. 1981లో పార్లమెంట్‌ ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దేశ వ్యాప్తంగా పరిశ్రమలన్నింటా పెద్దఎత్తున సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. తొలుత 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ ఎస్మా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ ఆర్డినెన్స్‌ స్థానంలో ఎస్మా చట్టం తీసుకొచ్చింది.

అత్యవసర సేవలంటే...

ప్రజల దైనందిన జీవితానికి అత్యవసరమని ప్రభుత్వం భావించే ఏ సేవ అయినా అత్యవసర సేవగా పరిగణించి, ఆయా సేవలకు సంబంధించి ఎస్మా వర్తిస్తుందని ప్రత్యేక ఉత్తర్వులు జారీచేయవచ్చు. ప్రధానంగా నీటి సరఫరా, ఆసుపత్రులు, పారిశుధ్యం, రవాణా, తంతి తపాలతో పాటు పెట్రోలు, బొగ్గు, విద్యుత్‌, ఉక్కు, ఎరువుల వంటి వనరుల ఉత్పత్తి రవాణా పంపిణీ సేవలన్నింటికీ దీన్ని వర్తింపజేయవచ్చు. బ్యాంకింగ్‌, ఆహారధాన్యాలు, ఆహారపదార్థాల పంపిణీ వంటి వాటన్నింటికీ దీన్ని వర్తింపచేయవచ్చు.

అతిక్రమిస్తే ఏం జరుగుతుంది?

ఎస్మా నిబంధనలు అతిక్రమించి సమ్మెకు దిగినట్లు ఎవరిపైనైనా అనుమానం ఉంటే, నేరశిక్షాస్మృతితో సంబంధం లేకుండా, వారెంట్‌ లేకుండానే పోలీసులు అరెస్టు చేయవచ్చు. సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్‌ చేయడంతోపాటు క్రమశిక్షణ చర్యలు చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్న వారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి జైలు, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. సమ్మెకు ఆర్థిక సహకారం అందించేవారూ శిక్షలకు అర్హులవుతారు.

గతంలో అంగన్వాడీలపై ఎస్మా లేదు కానీ..

అంగన్వాడీలు గతంలో ఎస్మా పరిధిలో లేరు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది అంగన్వాడీలు 26 రోజులుగా సమ్మె చేస్తున్నారు. జిల్లా, మండల, ఐసీడీఎస్‌ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రతిష్ఠ మసక బారింది. ఇది చూసి మరికొన్ని శాఖల ఉద్యోగులు కూడా డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. ఉక్కిరిబిక్కిరైన ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాల్సిందిపోయి కక్షపూరిత చర్యలకు దిగింది. ఏదోవిధంగా అంగన్వాడీల సమ్మెకు అడ్డుకట్ట వేయాలనే నిర్ణయానికి వచ్చిన జగన్‌ సర్కార్‌.. అత్యవసర సర్వీసుల పరిధిలోకి రాని అంగన్వాడీలను ఆ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసి మరీ వారిపై ఎస్మా అస్త్రం ప్రయోగించింది.

అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీలపై జగన్‌ సర్కారు పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా ఎస్మా అస్ర్తాన్ని ప్రయోగించింది. తద్వారా వారిని కట్టడి చేయాలని నిర్ణయించింది. ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశంమైంది. ఈ నేపఽథ్యంలో అసలేమిటి ఎస్మా చట్టం, ఎస్మా ప్రయోగిస్తే ఏమవుతుందన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఎస్మా అంటే ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌(అత్యవసరర సేవల నిర్వహణ చట్టం). బంద్‌ లేదా హర్తాళ్లు వంటివి చేయడం వల్ల ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడడం, కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణకు ఆటంకం లేకుండా కొనసాగేలా చూడడం కోసం 1981లో దీన్ని రూపొందించారు. అత్యవసర సేవలందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా, ఆయా సేవల కు విఘాతం కలిగేలా సమ్మె చేస్తే దీన్ని ప్రయోగిస్తారు. 1980లో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికి పోయింది. కార్మిక చట్టాల్లో మార్పులు తేవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఉద్యమించాయి. 1981లో పార్లమెంట్‌ ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దేశ వ్యాప్తంగా పరిశ్రమలన్నింటా పెద్దఎత్తున సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. తొలుత 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ ఎస్మా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ ఆర్డినెన్స్‌ స్థానంలో ఎస్మా చట్టం తీసుకొచ్చింది.

అత్యవసర సేవలంటే...

ప్రజల దైనందిన జీవితానికి అత్యవసరమని ప్రభుత్వం భావించే ఏ సేవ అయినా అత్యవసర సేవగా పరిగణించి, ఆయా సేవలకు సంబంధించి ఎస్మా వర్తిస్తుందని ప్రత్యేక ఉత్తర్వులు జారీచేయవచ్చు. ప్రధానంగా నీటి సరఫరా, ఆసుపత్రులు, పారిశుధ్యం, రవాణా, తంతి తపాలతో పాటు పెట్రోలు, బొగ్గు, విద్యుత్‌, ఉక్కు, ఎరువుల వంటి వనరుల ఉత్పత్తి రవాణా పంపిణీ సేవలన్నింటికీ దీన్ని వర్తింపజేయవచ్చు. బ్యాంకింగ్‌, ఆహారధాన్యాలు, ఆహారపదార్థాల పంపిణీ వంటి వాటన్నింటికీ దీన్ని వర్తింపచేయవచ్చు.

అతిక్రమిస్తే ఏం జరుగుతుంది?

ఎస్మా నిబంధనలు అతిక్రమించి సమ్మెకు దిగినట్లు ఎవరిపైనైనా అనుమానం ఉంటే, నేరశిక్షాస్మృతితో సంబంధం లేకుండా, వారెంట్‌ లేకుండానే పోలీసులు అరెస్టు చేయవచ్చు. సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్‌ చేయడంతోపాటు క్రమశిక్షణ చర్యలు చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్న వారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి జైలు, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. సమ్మెకు ఆర్థిక సహకారం అందించేవారూ శిక్షలకు

అర్హులవుతారు.

గతంలో అంగన్వాడీలపై ఎస్మా లేదు కానీ..

అంగన్వాడీలు గతంలో ఎస్మా పరిధిలో లేరు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది అంగన్వాడీలు 26 రోజులుగా సమ్మె చేస్తున్నారు. జిల్లా, మండల, ఐసీడీఎస్‌ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రతిష్ఠ మసక బారింది. ఇది చూసి మరికొన్ని శాఖల ఉద్యోగులు కూడా డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. ఉక్కిరిబిక్కిరైన ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాల్సిందిపోయి కక్షపూరిత చర్యలకు దిగింది. ఏదోవిధంగా అంగన్వాడీల సమ్మెకు అడ్డుకట్ట వేయాలనే నిర్ణయానికి వచ్చిన జగన్‌ సర్కార్‌.. అత్యవసర సర్వీసుల పరిధిలోకి రాని అంగన్వాడీలను ఆ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసి మరీ వారిపై ఎస్మా అస్త్రం ప్రయోగించింది.

Updated Date - Jan 07 , 2024 | 06:52 AM