Share News

ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రాజీనామా మిగిలిన వారి సంగతేంటో?

ABN , Publish Date - Jun 06 , 2024 | 04:12 AM

ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజు ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు.

ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రాజీనామా మిగిలిన వారి సంగతేంటో?

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజు ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. సహజంగా ఫలితాల సరళి తెలిసిన మరుక్షణమే నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయడం ఆనవాయితీ. కానీ సజ్జల మాత్రం తాపీగా బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఫలితాలు వచ్చిన తర్వాత కూడా సజ్జల రాజీనామా లేఖను ఒకరోజు తర్వాత పంపడంపై చర్చ సాగుతోంది. మిగిలిన సలహాదారులు ఎప్పటికి చేస్తారని రాజకీయవర్గాలు నిలదీస్తున్నాయి.

Updated Date - Jun 06 , 2024 | 07:31 AM