పేదల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Dec 23 , 2024 | 12:09 AM
పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభు త్వం పని చేస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు.
ఎమ్మెల్యే బడేటి చంటి
రద్దయిన టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు తిరిగి సొమ్ము చెల్లింపు
ఏలూరు టూటౌన్, జూన్ 3(ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభు త్వం పని చేస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. రద్దయిన టిడ్కో గృహ లబ్ధిదారుల సొమ్మును వారి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి చంటి శ్రీకారం చుట్టారు. శుభలేఖ కల్యాణ మండపంలో లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన 4,272 మంది టిడ్కో గృహ లబ్ధిదారులు కట్టిన డీడీ సొమ్ము ను వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఇప్పటికే 1,496 మంది ఖాతాల్లో 6 కోట్ల 23లక్షల 29వేలు జమ చేశాం. మిగిలిన వారి అప్లికేషన్ వెరిఫికేషన్ అనంతరం 2, 3 రోజుల్లో నగదు జమ అవుతుంది. ఒకవేళ చనిపోని ఉంటే వార సులకు ఆ సొమ్ము చెల్లిస్తాం. టీడీపీ ప్రభుత్వం మాటతప్పే ప్రభుత్వం కాద’న్నారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిశోర్, నగర కమిషనర్ భానుప్రతాప్, ఈడా చైర్మన్ శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ పార్థ సారథి, కార్పొరేటర్ అరుణ సురేశ్, ఎస్‌ఎం ఆర్. పెదబాబు, లబ్ధిదారులు పాల్గొన్నారు.