Share News

రసాభాసగా కౌన్సిల్‌ సమావేశం

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:11 AM

ఆడుదాం ఆంధ్రాకు ప్రభుత్వం నిధులు కేటాయించినా.. మునిసిపల్‌ జనరల్‌ ఫండ్‌ నిధులు ఎందుకు వెచ్చించారంటూ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొత్తపల్లి నాని, టీడీపీ సభ్యులు పాలూరి బాబ్జీ, స్వతంత్ర సభ్యులు కోటిపల్లి సురేష్‌ నిలదీశారు. చైర్‌పర్సన్‌ వెంకటరమణ అధ్యక్షతన బుధవారం జరిగిన కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా సాగింది.

రసాభాసగా కౌన్సిల్‌ సమావేశం

‘ఆడుదాం ఆంధ్రా’ నిధుల కేటాయింపుపై వీసీ ధ్వజం

నరసాపురం టౌన్‌, జనవరి 31: ఆడుదాం ఆంధ్రాకు ప్రభుత్వం నిధులు కేటాయించినా.. మునిసిపల్‌ జనరల్‌ ఫండ్‌ నిధులు ఎందుకు వెచ్చించారంటూ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొత్తపల్లి నాని, టీడీపీ సభ్యులు పాలూరి బాబ్జీ, స్వతంత్ర సభ్యులు కోటిపల్లి సురేష్‌ నిలదీశారు. చైర్‌పర్సన్‌ వెంకటరమణ అధ్యక్షతన బుధవారం జరిగిన కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా సాగింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ వార్డుల్లో జరిగే పనులకు నిధులు లేవంటారు. గత ఏడాది కుర్చీలు, టెంట్‌లు, మైక్‌లకు రూ.25 లక్షలు ఖర్చు అయిందని అజెండాలో చూపించారు. వీటికి ఇంత ఖర్చు అవుతుందా? అంటూ నిలదీశారు. దీనికి కమిషనర్‌ వెంకటేశ్వరావు స్పందిస్తూ ప్రభుత్వం నుంచి నిధులు రాగానే జనరల్‌ ఫండ్‌లో జమ చేస్తామన్నారు. టీడీపీ కౌన్సిలర్‌ పాలూరి బాబ్జీ మాట్లాడుతూ మునిసిపల్‌ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని సమగ్ర విచారణ చేయాలని కమిషనర్‌ను కోరారు. మునిసిపాల్టీలో శానిటేషన్‌ అస్తవ్యస్తంగా ఉందని వైసీపీ కౌన్సిలర్‌ వన్నెంరెడ్డి శ్రీనివాస్‌ నిలదీశారు. కమిషనర్‌ వివరణ ఇస్తూ పని చేయని కాంట్రాక్టులను కౌన్సిల్‌ అనుమతితో బ్లాక్‌లిస్టులో పెడతామన్నారు. మరో వీసీ కామన నాగిని మాట్లాడుతూ కమిషనర్‌ రూమ్‌లోంచి పైల్స్‌ బయటకు వెళ్లుతున్నా ఎందుకు చర్యలు తీసుకోరంటూ ప్రశ్నించారు. వన్నెంరెడ్డి శ్రీనివాస్‌, జనసేన కౌన్సిలర్లు బొమ్మిడి సూర్యకుమారి, భరత్‌ సురేష్‌, టీడీపీ కౌన్సిలర్‌ పాలూరి బాబ్జీ మాట్లాడుతూ మా వార్డులో ఒక్క ఆభివృద్ధి పని జరగలేదంటూ మండిపడ్డారు. దీనికి కో–ఆప్షన్‌ సభ్యులు వైకేఎస్‌ మాట్లాడుతూ అన్ని వార్డుల్లో ఆభివృద్ధి పనులు జరిగాయంటూ అత్మపరిశీలన చేసుకోవాలని కోరారు.

Updated Date - Feb 01 , 2024 | 12:11 AM