Share News

సంక్షేమ పథకాలు వలంటీర్ల ద్వారా అందించొద్దు

ABN , Publish Date - Mar 16 , 2024 | 02:12 AM

ఎన్నికలు ముగిసే వరకూ వివిధ పథకాల లబ్ధిదారులకు అందించే సంక్షేమ పథకాలను వలంటీర్ల ద్వారా అందించవద్దని సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ సూచించింది.

సంక్షేమ పథకాలు వలంటీర్ల ద్వారా అందించొద్దు

సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి రమేశ్‌ కుమార్‌

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ఎన్నికలు ముగిసే వరకూ వివిధ పథకాల లబ్ధిదారులకు అందించే సంక్షేమ పథకాలను వలంటీర్ల ద్వారా అందించవద్దని సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ సూచించింది. వాటి పంపిణీకి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని కోరింది. వలంటీర్లను పూర్తిగా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఆదేశాలను సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ గమనించిందని ఆ సంస్థ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే అంశంపై సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయడంతోనే ఈ ఆదేశాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ కూడా సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీకి చేరిన సమాచారం ప్రకారం వలంటీర్లు వారి సామీప్యత కారణంగా ఓటర్లను ప్రభావితం చేస్తూనే ఉన్నారని, ఓటర్లకు పారితోషకాలు, డబ్బులు, చీరలు తదితర తాయిలాలను పంపిణీ చేస్తున్నారని రమేశ్‌ కుమార్‌ తెలిపారు.

Updated Date - Mar 16 , 2024 | 08:46 AM