సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం
ABN , Publish Date - Dec 31 , 2024 | 11:18 PM
నాపరాళ్ల రాయల్టీ సమస్యను ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నంద్యాల ఎంపీ బైరెడ్డి, శబరి, డోన మాజీ ఎమ్మెల్యే కోట్ల సు జాతమ్మ యజమానులకు హామీ ఇచ్చారు.

ఫ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి
బేతంచెర్ల, డిసెంబరు 31 (ఆంధ్ర జ్యోతి): నాపరాళ్ల రాయల్టీ సమస్యను ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నంద్యాల ఎంపీ బైరెడ్డి, శబరి, డోన మాజీ ఎమ్మెల్యే కోట్ల సు జాతమ్మ యజమానులకు హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం బేతంచెర్లలో గను ల, ఫ్యాక్టరీలు, ట్రాక్టర్ల యజమానులు చేప ట్టిన రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని ఎంపీ , మాజీ ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొవిడ్ సమస్య ఉందని రాయల్టీలను పెంచిందన్నా రు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాయల్టీ రూ.100లు ఉండగా.. వైసీపీ ప్రభుత్వం పెంచడంతో వారు చేసిన దుర్మార్గపు పా లన వల్ల చిన్న పరిశ్రమల యజమానులకు ఈ దుస్థితి నె లకొందని ఆరోపించారు. రాష్ట్ర క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లి స మస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ పరిశ్రమల యజమానులకు అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ ఎల్ల నాగ య్య, సీనీయర్ నాయకు రాలు బుగ్గన ప్రసన్నలక్ష్మి, మాజీ ఎంపీపీ సోమశేకర్ రెడ్డి, పోలూరు రాఘవరెడ్డి, చంద్ర శేఖ ర్, సుధాకర్, ప్రభాకర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, పరిశ్రమ యజ మానుల సంఘం అధ్యక్షుడు హుశేన రెడ్డి, చంద్రమౌళీశ్వర్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి, నాగమయ్య, మోహనరావు, తిరుమలేష్ రెడ్డి, ఉపేంద్ర, రాంబాబు, వెంకటేశ్వర్లు, ప్యాక్టరీల యజ మానులు కార్మికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- బేతంచెర్ల పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ రో డ్డులో ఉంటున్న లబ్ధిదారులకు ఎల్లమ్మ, మాదన్న, తలారీ లక్ష్మీదేవిలకు ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సు జాతమ్మ పింఛన్లు పంపిణీ చేశారు. కమిషనర్ హరి ప్రసాద్, నాయకులు ఎల్ల నాగయ్య, బుగ్గన ప్రసన్నలక్ష్మి, రాఘవరెడ్డి, భీమేశ్వరరెడ్డి, షేక్షావలి చౌదరి పాల్గొన్నారు.