టమోటా మార్కెట్‌లో సమస్యలను పరిష్కరిస్తాం
ABN , Publish Date - Jul 15 , 2024 | 12:01 AM
మదనపల్లె టమోటా మార్కెట్‌లో ఐదేళ్లుగా ఉన్న సమ స్యలను ఇరువర్గాలతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజహాన బాషా హామీ ఇచ్చారు.
మదనపల్లె టౌన, జూలై 14: మదనపల్లె టమోటా మార్కెట్‌లో ఐదేళ్లుగా ఉన్న సమ స్యలను ఇరువర్గాలతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజహాన బాషా హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక పుంగనూరు రోడ్డులో లారీ అసోసియేషన నాయకు లతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లారీ, మినీ లారీ అసోసియేషన నాయకులు మాట్లాడుతూ మదనపల్లెలో 500 పైగా లారీలు, 400 పైగా మినీలారీలు ఉన్నాయని, ఇవన్నీ ప్రధానంగా స్థానిక టమోటా మార్కెట్ నుంచి టమోటాలను ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తూ వాటి మీదనే తమ కుటుంబాలు ఆధారపడ్డాయన్నారు. కాని కొంత మంది టమోటా వ్యాపారులు తమ లారీలను అద్దెకు పిలవకుండా బయట ప్రాం తాల నుంచి లారీలను తీసుకొచ్చి టమోటా లోడింగ్ చేయిస్తుండటంతో తమ లారీలకు అద్లెలు లేక అప్పులు పాలవుతున్నామన్నారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇరువర్గాలకు సముచితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామ న్నారు. అనంతరం స్థానిక అనపగుట్ట ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడ ప్రజలు మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతుండటంపై స్పందించారు. మున్సిపల్ అధికారు లతో చర్చించి అనపగుట్ట ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.