Share News

ఆర్టీసీలో సమస్యలు పరిష్కరిస్తాం

ABN , Publish Date - Jul 31 , 2024 | 02:28 AM

ఆర్టీసీ కోసం గడిచిన ఐదేళ్లలో ఒక్క కొత్త బస్సు కొనలేదు. అంతకు ముందున్న నాలుగు వేల బస్సులు రద్దు చేశారు.

ఆర్టీసీలో సమస్యలు పరిష్కరిస్తాం

ఈయూకు రవాణా మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి హామీ

అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): ‘ఆర్టీసీ కోసం గడిచిన ఐదేళ్లలో ఒక్క కొత్త బస్సు కొనలేదు. అంతకు ముందున్న నాలుగు వేల బస్సులు రద్దు చేశారు. కొత్త బస్సులు కొనాలి. ఉద్యోగుల ఖాళీలు భర్తీ చేయాలి’ అంటూ రవాణాశాఖ మంత్రి రాం ప్రసాద్‌ రెడ్డి ముందు ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సమస్యలు ఏకరువు పెట్టింది. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్‌ రావు నేతృత్వంలోని ఈయూ బృందం మంగళవారం విజయవాడలో మంత్రితో భేటీ అయింది. రవాణా సంస్థలో సమస్యలు, సిబ్బంది కొరత, మెడికల్‌ అన్‌ఫిట్‌ సిబ్బందికి ప్రత్యామ్నాయం, బస్సుల దుస్థితి, అలవెన్సుల పునరుద్ధరణ, అర్హులకు పదోన్నతులు తదితర అంశాలపై చర్చించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు కల్పించడంలో సిబ్బంది, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, సమస్యలు ఒక్కొక్కటిగా ప్రభుత్వం పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు.

Updated Date - Jul 31 , 2024 | 07:18 AM