Share News

పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తాం

ABN , Publish Date - Aug 21 , 2024 | 01:18 AM

ప్రతి పేదవాడికి సొం త ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తాం

కంకిపాడు, ఆగస్టు 20: ప్రతి పేదవాడికి సొం త ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కంకిపాడు మార్కెట్‌ యార్డ్‌లోని గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన గోడౌన్‌ను స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి ఆయన తనిఖీ చేశారు. గృహ నిర్మాణానికి సంబంఽధించిన సిమెంటు బస్తాలు, ఐరన్‌ నిలువలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు నాణ్యమైన సిమెంటు, ఐరన్‌ పంపిణీ చేయాలని సూచించారు. అనంతరం స్థానిక విలేకరులతో మంత్రి సార థి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సొంతింటి కల నె రవేర్చాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వ పని చే స్తోందన్నారు. వంద రోజుల్లో 1.25 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని, రానున్న మార్చి నాటికి 7 లక్షల ఇళ్లు పూర్తి చేసేలా ప్రణాళికలను రూపొందించుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారన్నారు. ఎమ్మె ల్యే బోడె ప్రసాద్‌ పలు సూచనలు చేశారని వాటిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. జిల్లాలోని వీ ఎంసీ పరిధిలోని లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల నిర్మాణం నాణ్యతగా లేవని ఫిర్యాదులు వచ్చాయన్నారు. గృహ నిర్మాణ శాఖ ఎండీతో ప్రత్యేకమైన విచారణ చేపడతామన్నారు. టీడీపీ హయాంలో పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తే చంద్రబాబుకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని గత వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. ఈ ఏడాదిలోగా నూరు శాతం టిడ్కో ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ మాట్లాడుతూ ఆర్భాటాలకు పోయి అప్పుల పాలువుతున్న లబ్ధిదారులకు నిర్మాణ వ్యయం తగ్గించుకోవడంలో సలహాలివ్వాలని అధికారులను కోరారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మెయిదిన్‌ దివాస్‌, ఎండీ పి.రాజాబాబు, ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, గృహ నిర్మాణ శాఖ సీఈ జీవీ ప్రసాద్‌, ఎస్‌ఈలు జయ రామాచారి, నాగభూషణం కృష్ణ, ఎన్టీఆర్‌ జిల్లాల హౌసింగ్‌ పీడీలు జీవీ సూర్యనారాయణ, రజిని, ఉయ్యూరు ఆర్డీవో డి.రాజు, మార్కెటింగ్‌ ఏడీ సత్యానందం, ఈఈ ఎస్‌ వెంకట్రావు, డీఈ శివప్రసాద్‌రావు, ఏఈ అబ్దుల్‌ జిల్లా, మాజీ ఎంపీపీ దేవినేని రాజ, ఎంపీపీ నెరుసు రాజ్యలక్ష్మీ, టీడీపీ, జనసేన సమన్వయ కర్త ముప్పా రాజా, టీడీపీ, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

బాంబు పేల్చిన మంత్రి సారథి

మార్చి నాటిని ఇళ్ల నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థికసాయం అందకుండా పోతుందని మంత్రి సారథి తెలిపారు. కంకిపాడులో మంగళవారం పర్యటించిన ఆయన మాట్లాడుతూ ఇళ్లనిర్మాణంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటన్నారు. లబ్ధిదారులు వచ్చే 2025 నాటికి ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. లేకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రానున్న ఆర్థిక సాయం అందకుండా పోతుందన్నారు. ఇక ఎప్పటికీ వారికి ఆర్థికసాయం అందదన్నారు. లబ్ధిదారులు తక్షణం ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.

Updated Date - Aug 21 , 2024 | 06:50 AM