Share News

రీయింబర్స్‌మెంటు రాక చదువులు ఆపేశాం

ABN , Publish Date - Jan 28 , 2024 | 03:13 AM

మాకు ఉచితాలు వద్దు, భవిష్యత్తు కావాలి’’ అంటూ నినదిస్తూ విదార్థులు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్‌ అన్‌ ఎంపాయీస్‌ అండ్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో శనివారం ఽధర్నా జరిగింది.

రీయింబర్స్‌మెంటు రాక చదువులు ఆపేశాం

సర్టిఫికెట్లు కళాశాలల్లోనే ఉండిపోయాయి

15 రోజుల్లో ఇప్పించాలి: విద్యార్థుల ధర్నా

ధర్నాచౌక్‌, జనవరి 27: ‘‘మాకు ఉచితాలు వద్దు, భవిష్యత్తు కావాలి’’ అంటూ నినదిస్తూ విదార్థులు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్‌ అన్‌ ఎంపాయీస్‌ అండ్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో శనివారం ఽధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఫెడరేషన్‌ అధ్యక్షుడు దాడి మురళీకృష్ణ మాట్లాడుతూ ఎల్‌కేజీ నుంచి పీజీ దాకా ఫీజు రీయంబర్స్‌మెంట్‌ రాకపోవడంతో అత్యధిక ఫీజులు చెల్లించలేక తమ చదువులు మధ్యలోనే ఆపేశామన్నారు. అయితే సర్టిఫికెట్లు వెనక్కివ్వకపోవడంతో తమ భవితవ్యం అంధకారంలోకి జారిపోయిందని వాపోయారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 22 శాతం పైగా విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలల్లోనే ఉండిపోయాయన్నారు. 15 రోజుల్లోగా విద్యార్థుల సర్టిఫికెట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్యను పరిష్కరించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీడీపీ నేతలు పతావుల్లా, మాధవ్‌, బీసీ సంక్షేమ సంఘం నేత లక్ష్మణరావు ధర్నాకు మద్దతు పలికారు.

Updated Date - Jan 28 , 2024 | 08:25 AM