Share News

మనమంతా ఒక కుటుంబం

ABN , Publish Date - Feb 01 , 2024 | 03:07 AM

మనమంతా ఒక కుటుంబం. ధైర్యంగా ఉండండి. పార్టీ మీకు అండగా ఉంటుంది’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు.

మనమంతా ఒక కుటుంబం

బాబు అరెస్టుతో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు భువనేశ్వరి ఓదార్పు

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొనసాగిన ‘నిజం గెలవాలి’ యాత్ర

ఒంగోలు, నెల్లూరు, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ‘మనమంతా ఒక కుటుంబం. ధైర్యంగా ఉండండి. పార్టీ మీకు అండగా ఉంటుంది’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా బుధవారం ఆమె ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు. మంగళవారం రాత్రి ప్రకాశం జిల్లా ఒంగోలులో బస చేసిన భువనేశ్వరి బుధవారం దర్శి; ముండ్లమూరు, తాళ్లూరు, టంగుటూరు, కొండపి మండలాల్లో నిజం గెలవాలి యాత్ర కొనసాగించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక దర్శి పట్టణంలో మరణించిన పరిశుద్ధరావు, ముండ్లమూరు మండలం శింగన్నపాలెంలో హనుమంతరావు, తాళ్లూరు మండలం తూర్పుగంగవరంలోని ఆశ్రమంలో జంపాని నరసింహారావు, టంగుటూరులో దుగ్గినేని అరుణ్‌కుమార్‌, కొండపి మండలం కె.ఉప్పలపాడులో జంగాల అంజయ్య, నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం టెంకాయచెట్లపాలెం, ఆత్మకూరు గ్రామాలకు చెందిన వాయిల సుందరరావు, ఎండ్లూరి చిన్నకోటయ్యల కుటుంబాలను పరామర్శించారు. పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చెక్కులు అందజేశారు. కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. రాత్రికి ఆమె కందుకూరులో బస చేశారు. గురు, శుక్రవారాల్లో ఆమె నెల్లూరు నగరం, వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, రాపూరు మండలాల్లో పర్యటించనున్నారు.

Updated Date - Feb 01 , 2024 | 09:09 AM