Share News

ముంచుకొచ్చిన నీటి ముప్పు

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:52 PM

ఈ ఏడాది వేసవి రాకముందే నీటి ముప్పు ముంచుకొచ్చింది. వర్షాలు పెద్దగా కురియక పోవడంతో ఎండ వేడిమికి అరకొరగా ఉన్న భూగర్భజలాలు అడుగంటాయి.

  ముంచుకొచ్చిన నీటి ముప్పు
1. గోనెగండ్లలో ఎండిపోయిన బావి

అడుగంటి పోతున్న భూగర్భజలాలు

ఎండిపోయిన రెండువేలబావులు, మూడువేల బోర్లు

గోనెగండ్ల, ఫిబ్రవరి 20: ఈ ఏడాది వేసవి రాకముందే నీటి ముప్పు ముంచుకొచ్చింది. వర్షాలు పెద్దగా కురియక పోవడంతో ఎండ వేడిమికి అరకొరగా ఉన్న భూగర్భజలాలు అడుగంటాయి. బావులు, బోర్లు, చెరువులు, కుంటలు అడుగంటాయి. వీటి కింద సాగుచేసిన పంట పొలాలకు నీరందక ఎండుముఖం పట్టాయి.

ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల మండలాల్లో దాదపు రెండువేల బావులు, మూడువేల బోర్లు అడుగంటి పోయాయి. ముందస్తు ఎండలు రావ డం, సకాలంలో పెద్దవర్షాలు కురియక పోవడం కారణంగా బోర్లు ఎండిపోతున్నాయి. గోనెగండ్ల, కులుమాల, ఎర్రబాడు, అలువాల, అగ్రహరం, గంజహళ్లి, బైలుప్పల, పెద్దమరివీడు, చిన్నమరివీడు, పెద్దనేలటూరు, చిన్ననేలటూరు హెచ్‌ కైరవాడి, పిల్లిగుండ్ల, గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో బోర్లు, బావులు అడుగంటి పోతున్నాయి. బోర్లకింద సాగుచేసన దాదాపు పదివేల ఎకరాల పంట నీరందక నీరసించడంతో రైతులు తల్లడిల్లుతున్నారు.

నాలుగుబోర్లు ఎండిపోయాయి

నాలుగు ఎకరాల్లో వేసిన నాలుగు బోర్లు ఎండిపోయాయి. వర్షాకాలం బోర్లలో నీరు బాగానే ఉంది. ఎమైందో ఎమో గానీ ఎండలు మండిపోయేకొద్ది బోర్లలో నీరు అండుగంటి పోతోంది. సాగు చేసిన పంటలు ఎండి పోతున్నాయి.

- జయరాముడు, పిల్లిగుండ్ల

పంటలు ఎండిపోతున్నాయి

బోర్ల కింద చెవలకాయి. కొర్ర, మొక్కజొన్న పంటలు సాగు చేశా. బోరు, బావుల్లో నీరు అడుగంటి పోయింది. సాగు చేసిన పంటలు చేతికి అందే సమయంలో నీరు లేక పోవడంతో ఎండిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడి చేతికి అందేలే కనిపించడం లేదు.

- కబుల్‌, రైతు, గోనెగండ్ల

Updated Date - Feb 20 , 2024 | 11:52 PM