Share News

నీటి నాటకం!

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:43 AM

‘కుప్పం నియోజకవర్గానికి నీళ్లిచ్చాం’ అని చెప్పుకొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆడిన గేటు నాటకమిది! ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ఆయన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం బ్రాంచి కాలువ గేటును బటన్‌ నొక్కి పైకెత్తారు.

ఆ గేటును పూలతో చక్కగా అలంకరించి పూజలు చేశారు. కృష్ణమ్మకు పట్టువస్త్రాన్నీ సమర్పించారు. కానీ... అదంతా ఒట్టి నాటకం. 24 గంటల్లోనే ఆ గేటును అధికారులు జేసీబీతో ఎత్తి, లారీలో వేసుకుని తీసుకెళ్లిపోయారు. టీడీపీ హయాంలోనే దాదాపు 85 శాతం పూర్తయిన కెనాల్‌ ఇది! మిగిలిన 15 శాతం పనులను కూడా జగన్‌ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. కానీ.. ఎన్నికల ముందు ‘కుప్పానికి కృష్ణా జలాలు’ పేరుతో భారీ హంగామా చేసింది. కానీ, ఆ కథ అడ్డం తిరిగింది! నాటకం బయటపడటంతో అభాసుపాలయ్యారు.

Updated Date - Apr 25 , 2024 | 05:44 AM