Share News

సామాజిక న్యాయమార్గంలో నడవాలి

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:03 AM

ప్రంపంచలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన భారతరత్న డాక్టర్‌ బీ ఆర్‌ అంబేడ్కర్‌ నిర్దేశించిన సామాజిక న్యాయమార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని జేసీ రాహుల్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

సామాజిక న్యాయమార్గంలో నడవాలి

జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి

నంద్యాల (కల్చరల్‌), జనవరి 17: ప్రంపంచలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన భారతరత్న డాక్టర్‌ బీ ఆర్‌ అంబేడ్కర్‌ నిర్దేశించిన సామాజిక న్యాయమార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని జేసీ రాహుల్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ కార్డియార్‌లో సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ఛాయా చిత్రప్రదర్శనను జాయింట్‌కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌ రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం డాక్టర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 19న విజయవాడలో దాదాపు రూ.400కోట్లతో 20 ఎకరాలలో అంబేడ్కర్‌ స్మృతివనం ఏర్పాటుతో పాటు 125 అడుగుల విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సామాజిక న్యాయానికి స్ఫూర్తిగా ఘనంగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సామాజిక సమతా సంకల్పం కార్యక్రమాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ వారు ఛాయా చిత్ర ప్రదర్శన కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. అనంతరం దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ముపాలెం శ్రీనివాస్‌, మాలమాహానాడు రాష్ట్ర గౌరవఅధ్యక్షుడు లింగస్వామి, తదితరులు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ జీవితచరిత్ర, ఆయన సమాజానికి చేసిన సేవలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి, మున్సిపల్‌ కమిషనర్‌ రవిచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, తదితర అధికారులు, వివిధ దళిత సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొని డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలవేసి ఘనంగా నివాళి అర్పించారు.

Updated Date - Jan 18 , 2024 | 12:03 AM