Share News

రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఓ దుర్మరణం

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:50 PM

మండల పరిధిలోని కల్లూరు ఆగ్రహారం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఓ అమర్నాథ్‌ (36) దుర్మరణం చెందారు.

రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఓ దుర్మరణం
అమర్నాథ్‌(ఫైల్‌)

గార్లదిన్నె, జూన 8: మండల పరిధిలోని కల్లూరు ఆగ్రహారం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఓ అమర్నాథ్‌ (36) దుర్మరణం చెందారు. గార్లదిన్నె మండలం కమలాపురం గ్రామానికి చెందిన అమర్నాథ్‌ పామిడి మండలం కత్రిమల వీఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం పనినిమిత్తం ద్విచక్ర వాహనంలో పామిడికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా కల్లూరు ఆగ్రహారం వద్ద బొలెరో ఢీకొంది. ప్రమాదంలో వీఆర్‌ఓ అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మహమ్మద్‌గౌస్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jun 08 , 2024 | 11:50 PM