Share News

వలంటీర్లు బాధ్యతగా సేవలందించాలి

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:26 PM

వలంటీర్లు బాధ్యతగా సేవలందించాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు.

వలంటీర్లు బాధ్యతగా సేవలందించాలి
వలంటీర్‌ను సన్మానిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యేలు

కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

రాయచోటి(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 15: వలంటీర్లు బాధ్యతగా సేవలందించాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. గురువారం రాయచోటి కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ప్రభుత్వం వరుసగా 4వ ఏడాది చేపట్టిన వలంటీర్లకు వందనం కార్యక్రమంపై గుంటూరు జిల్లా ఫిరంగిపురం నుంచి ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమం సీఎం జగన్‌ చేపట్టారు. వర్చువల్‌ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌కిశోర్‌, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వండాడి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ నేడు పురస్కారాలు అందుకున్న వలంటీర్లు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. జిల్లాలో వలంటీర్లు మరింత బాధ్యతగా ప్రజలకు సేవలందించాలని చెప్పారు. కార్యక్రమంలో జీఎ్‌సడబ్ల్యుఎస్‌ జిల్లా అధికారి లక్ష్మీపతి, జడ్పీ డిప్యూటీ సీఈవో రమణారెడ్డి, గ్రామ, వార్డు వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 11:26 PM