Share News

వివేకా హత్య బాధాకరం

ABN , Publish Date - Apr 30 , 2024 | 03:55 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేయడం, ఆ వయసు వ్యక్తి పట్ల అలా ప్రవర్తించడం బాధాకరమని బ్రదర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు. దానిని సమర్థించడం తప్పు అని చెప్పారు.

వివేకా హత్య బాధాకరం

దానిని సపోర్టు చేయడం తప్పు..

సత్యాన్ని ఓడించే శక్తి మనిషికి లేదు

చర్చిల్లో రాజకీయాలు మాట్లాడను

షర్మిలకు ఓటు వేయమని అడగను: బ్రదర్‌ అనిల్‌

బద్వేలు, ఏప్రిల్‌ 29: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేయడం, ఆ వయసు వ్యక్తి పట్ల అలా ప్రవర్తించడం బాధాకరమని బ్రదర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు. దానిని సమర్థించడం తప్పు అని చెప్పారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ఇక్కడి వ్యవహారాలన్నీ వివేకా చక్కదిద్దేవారని చెప్పారు. వైఎ్‌సకు కుడిభుజంలా ఉండేవారని తెలిపారు.


అలాంటి వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజకీయాన్ని కమర్షియల్‌గా మార్చారని అన్నారు. తాను చర్చిలో ప్రార్థన చేస్తాను తప్ప రాజకీయాలు మాట్లాడనని స్పష్టం చేశారు. అలాగే షర్మిలకు ఓటు వేయమని ఎవరినీ అడగబోనని పేర్కొన్నారు. ఎప్పటికీ న్యాయానిదే విజయమని, డబ్బు వ్యామోహంతో ఎవరూ కక్కుర్తి పడొద్దని కోరారు. అన్యాయానికి బలం ఉండదని, న్యాయాన్ని ఓడించే సామర్థ్యం ఏ మనిషికి, డబ్బుకు ఉండదని తెలిపారు.

Updated Date - Apr 30 , 2024 | 09:04 AM