జైలు ఇన్‌చార్జి వేధిస్తున్నారు
ABN , Publish Date - Dec 29 , 2024 | 05:01 AM
విశాఖలోని కేంద్ర కారాగారం ఎదుట జైలు వార్డర్లు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఆందోళనకు దిగారు. తమను విధి నిర్వహణ పేరుతో ఇన్‌చార్జి సూపరింటెండెంట్ మహే్‌షబాబు వేధిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విశాఖ సెంట్రల్ జైలు ఎదుట వార్డర్ల ఆందోళన
ఆరిలోవ (విశాఖపట్నం), డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): విశాఖలోని కేంద్ర కారాగారం ఎదుట జైలు వార్డర్లు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఆందోళనకు దిగారు. తమను విధి నిర్వహణ పేరుతో ఇన్‌చార్జి సూపరింటెండెంట్ మహే్‌షబాబు వేధిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జైళ్ల శాఖ ఉన్నతాధికారులు వచ్చే వరకు కదిలేది లేదంటూ భీష్మించారు. దీనిపై ఇన్‌చార్జి సూపరింటెండెంట్ మహే్‌షబాబు వివరణ ఇస్తూ.. వార్డర్లు జయకృష్ణ, శంభు విధుల్లోకి వచ్చినప్పుడు తరచూ గంజాయితో వస్తున్నారని, దీనిపై సమాచారం ఉండడంతోనే వారిద్దరినీ తనిఖీ చేశామని తెలిపారు. జైలు నిబంధనలకు లోబడి, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నామన్నారు.