అల్లూరి కలెక్టరుగా విజయ సునీత
ABN , Publish Date - Feb 15 , 2024 | 02:47 AM
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరికొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి ఎం.విజయ సునీతను అల్లూరి సీతారామరాజు జిల్లాకు కలెక్టరుగా నియమించారు. అల్లూరి కలెక్టరు సిమిత్‌కుమార్‌ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరుగా బదిలీ చేశారు.
మరికొందరు ఐఏఎ్‌సల బదిలీ
అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరికొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి ఎం.విజయ సునీతను అల్లూరి సీతారామరాజు జిల్లాకు కలెక్టరుగా నియమించారు. అల్లూరి కలెక్టరు సిమిత్‌కుమార్‌ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరుగా బదిలీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరుగా పని చేస్తున్న పి.ప్రశాంతికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చా రు. ఇక్కడ పనిచేస్తున్న ఐఎ్‌ఫఎస్ అధికారి రాహుల్ పాండేకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయనను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జి. వీరపాండియన్‌కు పౌరసరఫరాలశాఖ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.