Share News

ఏపీఈఏపీ సెట్‌లో విజ్ఞాన్‌ ప్రభంజనం

ABN , Publish Date - Jun 12 , 2024 | 02:37 AM

ఏపీఈఏపీ సెట్‌ ఫలితాల్లో విజ్ఞాన్‌ జూనియర్‌ కాలేజీకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ మంగళవారం తెలిపారు.

ఏపీఈఏపీ సెట్‌లో విజ్ఞాన్‌ ప్రభంజనం

గుంటూరు(విద్య), జూన్‌ 11: ఏపీఈఏపీ సెట్‌ ఫలితాల్లో విజ్ఞాన్‌ జూనియర్‌ కాలేజీకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ జె.మోహన్‌రావు మాట్లాడుతూ వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన ఐ.హనీత్‌ (387), టి.సంజయ్‌ తేజ (494), ఎ.రోహన్‌ (904), సి.రేవంత్‌ (957), పి.అమర లోకేష్‌ (1015), పి.గౌతమ్‌ (1195), కె.కారుణ్య (1206), ఎం.నాగ సాయి ప్రకాష్‌ (1219), బి.యోగ విజయ్‌ కుమార్‌ (1369), సిహెచ్‌.వెంకట ఉదయ్‌ ఆదిత్య (1377), కె.దక్షిణ్‌ (1777), ఎం.వివేక్‌ పూజిత్‌ కుమార్‌ (1964) ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకులతో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య, ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు జె.మోహన్‌రావు, వై.వెంకటేశ్వరరావు, విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలల సిబ్బంది అభినందనలు తెలిపారు.

Updated Date - Jun 12 , 2024 | 07:23 AM