Share News

టీడీపీ వైపు వైసీపీ కౌన్సిలర్ల చూపు

ABN , Publish Date - Jun 09 , 2024 | 02:07 AM

సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో టీడీపీ సునామీని సృష్టించడంతో ఆ ప్రభావం మార్కాపురం మున్సిపాలిటీపై పడింది.

టీడీపీ వైపు వైసీపీ కౌన్సిలర్ల చూపు

మార్కాపురం, జూన్‌ 8: సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో టీడీపీ సునామీని సృష్టించడంతో ఆ ప్రభావం మార్కాపురం మున్సిపాలిటీపై పడింది. మార్కాపురంలో సైతం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి 13,971 ఓట్లతో గెలుపొందాడు. రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ నాయకుల దృష్టి టీడీపీపై ప డింది. ముఖ్యంగా మార్కాపురంలో వైసీపీ కౌన్సి లర్లు టీడీపీ వైపు చూస్తున్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, టీడీపీ పోల్‌మేనేజ్‌న్మెంట్‌ ఇంచార్జి కందుల రామిరెడ్డిలు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే టీడీపీలోకి దూకడానికి పలువురు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా టీడీపీలోకి చేరి తమ జేబులు నింపుకోవడానికి పలువురు ఉన్నారు.

సీనియర్‌ కౌన్సిలర్‌తో మంతనాలు

మార్కాపురం పురపాలక సంఘంలో 35 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో ఐదుగురు టీడీపీకి చెందినవారు. 30 మంది వైసీపీకి చెందిన వారు ఉన్నారు. ప్రస్తుతమున్న పాలకమండలి ఏర్పడి 3 సంవత్సరాలు గడుస్తోంది. నిబంధనల మేరకు అ విశ్వాసం ప్రవేశపెట్టడానికి మరో ఏడా ది సమయం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థలలో వైసీపీ పాలకవర్గాలున్నాయి. వాటిని మార్చడానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కొత్త జీవో తీసుకువస్తాడని ప్రచా రం సాగుతోంది. ఈ నేపథ్యంలో మార్కాపురం మున్సిపల్‌ చైర్మన్‌ను తొలగిస్తారని, అందుకు అవసరమైన మద్దతు తామిస్తామని పలువురు వైసీపీ కౌన్సిలర్లు ముందుకొస్తున్నట్లు సమా చారం. అందుకు సంబంధించి టీడీపీలో మున్సిపల్‌ మాజీచైర్మన్‌ భర్త, మాజీ కౌన్సిలర్‌తో వ్యాపార సంబంధాలున్న వైసీపీ కౌన్సిలర్‌ మంతనాలు జరిపినట్లు ప్రచారం సాగు తోంది. ఆర్యవైశ్య సామాజికవర్గంలో రాష్ట్రస్థాయిలో పార్టీ పదవిలో ఉన్న సద రు నాయకుడు వేచిచూసి పార్టీ స్థానిక నాయకత్వం అభిప్రాయం మేరకు ముందడగు వేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

వార్డు అభివృద్ధి కోసం కొందరు

రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా పార్టీ మారతామని కబురు పంపుతున్న కౌన్సిలర్లు కొందరు కొన్ని ప్రతిపాదన లను తయారు చేసుకున్నట్లు తెలిసింది. పలువురు కౌన్సిలర్లు గత మున్సిపల్‌ ఎన్నికల సమయంలో వార్డులో ఇచ్చిన హామీలను మూడేళ్లలో చేయలేకపోయామని, ప్రజలు నిల దీస్తున్నారని, ఆ పనులను పూర్తి చేసే విధంగా టీడీపీ నాయకత్వం నుంచి హామీ తీసుకొని పార్టీ మారాలని పలువురు కౌన్సిలర్లు నిర్ణయించుకు న్నట్లు తెలిసింది. కాగా పలువురు కౌన్సిలర్లు మాత్రం ‘భవిష్యత్తు రాజకీయాలు మాకెందుకు, ప్రజలకు మేలు చేస్తే మాకెందుకు, చేయకపోతే మాకెందుకు మా జేబు నిండితే చాలు’ అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jun 09 , 2024 | 02:07 AM