Share News

విజయోత్సవాలకు అనుమతి లేదు

ABN , Publish Date - Jun 02 , 2024 | 11:38 PM

ఎన్నికల ఫలితాలను పురస్కరించుకొని మంగళవారం ఆదోని సబ్‌ డివిజన్‌ పరిధిలో విజయోత్సవ ర్యాలీలు, వేడుకలు నిర్వహించడానికి అనుమతి లేదని ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు.

విజయోత్సవాలకు అనుమతి లేదు

ఆదోని, జూన్‌ 2: ఎన్నికల ఫలితాలను పురస్కరించుకొని మంగళవారం ఆదోని సబ్‌ డివిజన్‌ పరిధిలో విజయోత్సవ ర్యాలీలు, వేడుకలు నిర్వహించడానికి అనుమతి లేదని ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఆదోని సబ్‌ డివిజన్‌ పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున ఎలాంటి విజయోత్సవాలు, ర్యాలీలు జరుపకూడదన్నారు. బాణాసంచా కాల్చడం, డీజే వినియోగం, బైక్‌ ర్యాలీలు, ఇతర ర్యాలీలతోపాటు, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వాహణ, గుంపులుగా తిరగడం నిషేధం అని తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు, కార్యకర్తలతో పాటు ఓటమి పాలైన పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం సమన్వయంతో వ్యవహరిస్తూ పోలీసులకు పూర్తి సహకారాన్ని అందించాలన్నారు. పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అల్లర్లు సృష్టిస్తే కఠినచర్యలు

దేవనకొండ : ఎన్నికల ఫలితాల నేఫథ్యంలో మండలంలో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని పత్తికొండ డీఎస్పీ శ్రీనివాస రెడ్డి ,ఒంగోలు పోలీసు ట్రైనింగ్‌ సీఐ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం దేవనకొండ పోలీసు స్టేషన్లో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం అయ్యారు. సార్వత్రిక ఫలితాల నేపథ్యంలో బాణాసంచా కాల్చడం ,సంబరాలు చేసుకొవడం లాంటి ఘటనలు చేస్తే ఎవ్వరినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సహాజమన్నారు. ఆడంభరాలకు దూరంగా ఉండాలన్నారు. సీఐ శ్రీనివాసులు, ఎస్సై రాజారావు తదితరులు ఉన్నారు.

ప్రశాంతతకు సహకరించండి

ఎమ్మిగనూరుటౌన్‌ : కౌంటింగ్‌ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ప్రశాంతతకు అందరూ సహకరించాలని ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య కోరారు. ఆదివారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో సెక్షన్‌ 144, పోలీసు యాక్డు 30 అమల్లో ఉంటుందన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక పోలీసు పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌ సందర్బంగా ప్రజలు సహకరించాలని, పోలీసుల సూచనలను పాటించి ప్రశాంతంగా ఉండాలని కోరారు. సమావేశంలో సీఐలు మధుసూధన్‌రావు, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 11:38 PM