టీటీడీ అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతల స్వీకారం
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:15 AM
టీటీడీ అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : టీటీడీ అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా జేఈవో వీరబ్రహ్మం శ్రీవారి జ్ఞాపిక అందజేశారు. అనంతరం వెంక య్య చౌదరి ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ..శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు సౌకర్యాలను ఇంకా మెరుగుపరుస్తామని తెలిపారు. దర్శనం, వసతి, పరిశుభ్రత, అన్నప్రసాదాల పంపిణీ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రతి విభాగంపై సమీక్షలు నిర్వహించి గుర్తించిన లోటుపాట్లను సవరిస్తామన్నారు. దేవుని సన్నిధిలో పనిచేసే అవకాశాన్ని కల్పించిన సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.