Share News

నేత్రపర్వం ... వాసవీ జయంత్యుత్సవం

ABN , Publish Date - May 18 , 2024 | 11:50 PM

ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు శనివారం జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నేత్రపర్వంగా సాగాయి. వేడుకల నేపథ్యంలో వాసవీ మందిరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

నేత్రపర్వం ... వాసవీ జయంత్యుత్సవం
కొత్తూరులో జరిగిన నగరోత్సవంలో వాసవీమాత

ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు శనివారం జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నేత్రపర్వంగా సాగాయి. వేడుకల నేపథ్యంలో వాసవీ మందిరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. జిల్లాకేంద్రంలో కొత్తూరు, పాతూరు ఆర్యవైశ్య సంఘాలు, యువజనసంఘాలు, మహిళాసంఘాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో వందలాదిమంది ఆర్యవైశ్యులు పాల్గొని అమ్మవారికి నీరాజనాలు పలికారు. దీంతో కొత్తూరు, పాతూరులలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయాలుభక్తజనంతో కిక్కిరిసిపోయాయి.

- అనంతపురం కల్చరల్‌

Updated Date - May 18 , 2024 | 11:50 PM