Share News

వంకల్లో నీటినిల్వ లేకుండా చర్యలు

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:43 PM

నగరంలో ఉన్న వంకల్లో ఎక్కడా వర్షం నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక అధికారులను కలెక్టరు వినోద్‌కుమార్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే దగ్గుబాటిప్రసాద్‌తోపాటు నగరపాలక అధికారులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు.

వంకల్లో నీటినిల్వ లేకుండా చర్యలు
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

72 గంటల్లో కార్యాచరణ ప్రణాళిక తయారు చేయండి

నగరపాలక అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

అనంతపురం టౌన, జూన 8: నగరంలో ఉన్న వంకల్లో ఎక్కడా వర్షం నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక అధికారులను కలెక్టరు వినోద్‌కుమార్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే దగ్గుబాటిప్రసాద్‌తోపాటు నగరపాలక అధికారులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీవర్షం వచ్చిన సమయంలో ఆ నీరు ఎక్కడికి పోతుంది..? ఏ ప్రాంతం ప్రభావితం అవుతోంది. ఎలాంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారో తెలుసుకుని 72 గంటల్లో కార్యాచరణప్రణాళిక సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. మరవ వంకలు ఉన్న ప్రాంతాలను పరిశీలించి ఎక్కడా చెత్త ఉండకుండా వెంటనే తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. డ్రైనేజీ వ్యవస్థలను శభ్రం చేయించడానికి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని, ఈ కార్యాచరణను కమిషనర్‌ పర్యవేక్షించాలన్నారు. ఫోనఇన చేపట్టి ప్రజలనుంచి వచ్చే సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించాలన్నారు. వర్షాకాలంలో దోమలు పెరిగి సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రతి ప్రాంతంలోను ఫాగింగ్‌ చేయాలని ఆదేశించారు. శానిటరీ ఇనస్పెక్టర్లు సంబంధిత ఫొటోలను తీసి అప్‌లోడ్‌ చేయాలని, కంట్రోల్‌రూం నుంచి అధికారులు పర్యవేక్షించాలన్నారు. నగరపాలక అభివృద్ధికి అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని, తనవంతు సహకారం అందిస్తానని కలెక్టర్‌ తెలిపారు.

ఆక్రమణలపై చర్యలు తీసుకోండి

: ఎమ్మెల్యే దగ్గుబాటి

నగరంలోని నడమివంక, మరువవంకలవద్ద పెద్దఎత్తున ఆక్రమణలు జరగడం వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వెంటనే ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్‌ కలెక్టరు వినోద్‌ కుమార్‌, కమిషనర్‌ మేఘస్వరూ్‌పలను కోరారు. వంకలు కిలోమీటర్ల మేర పోతుండడం వల్ల ఆ వెళ్లే ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల నీరుబ్లాక్‌ అయి వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. వర్షాకాలం నేపథ్యంలో పెద్దఎత్తున మొక్కల నాటేకార్యక్రమం చేపట్టి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ మేఘస్వరూఫ్‌, మున్సిపాల్‌ ఆర్డీ పీవీఎ్‌సఎస్‌ మూర్తి, విద్యుతశాఖ ఎస్‌ఈసురేంద్ర, పబ్లిక్‌ హెల్త్‌ డీఈ రామ్మోహన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 11:43 PM