Share News

10న వడ్డె ఓబన్న విగ్రహావిష్కరణ

ABN , Publish Date - Oct 27 , 2024 | 12:32 AM

తొలి స్వాతంత్ర సమర యోధుడు వడ్డె ఓబన్న విగ్రహాన్ని కదిరిలో వచ్చే నెల 10న ప్రారంభిస్తున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు.

10న వడ్డె ఓబన్న విగ్రహావిష్కరణ
కర పత్రాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కందికుంట

కదిరి అర్బన, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): తొలి స్వాతంత్ర సమర యోధుడు వడ్డె ఓబన్న విగ్రహాన్ని కదిరిలో వచ్చే నెల 10న ప్రారంభిస్తున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌తో కలిసి.. ఆయన నివాసంలో ఆవిష్కరించిన వారు మాట్లాడారు. సమాజం కోసం ప్రాణాలు లెక్కచేయని ఆయన వ్యక్తిత్వం యువతకు ఆదర్శమన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వడ్డెర్లు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ప్రభుత్వం పరంగా అన్నిరకాల సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో వడ్డెర సంఘం అధ్యక్షుడు డాబా గంగయ్య, సైదాపురం రమణ, నరసింహులు, చల్లా చంద్రశేఖర్‌, వెంకటరమణ, నారాయణ, పెద్ద వేమయ్య పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 12:32 AM