Share News

హెల్మెట్‌ వినియోగం శ్రేయస్కరం

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:03 AM

ద్విచక్ర వాహనదారు లు హెల్మెట్‌ వాడకం వల్ల శ్రేయస్కరమని ఆత్మకూరు డీఎస్పీ రామాంజీనాయక్‌ పేర్కొన్నారు.

హెల్మెట్‌ వినియోగం శ్రేయస్కరం
హెల్మెట్‌ వాడకంపై అవగాహన కల్పిస్తున్న పోలీసు అధికారులు

ఆత్మకూరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనదారు లు హెల్మెట్‌ వాడకం వల్ల శ్రేయస్కరమని ఆత్మకూరు డీఎస్పీ రామాంజీనాయక్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్‌సింగ్‌ రాణా ఆదేశాల మేరకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో పోలీసు అధికారులు, సిబ్బంది హెల్మెట్‌ ధరించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీసు స్టేషన నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కేజీరోడ్డు, గౌడ్‌సెంటర్‌ మీదుగా చక్రంహోటల్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా గౌడ్‌సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ ద్విచ క్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ వాడకం వల్ల ఏదైనా ప్రమా దం సంభవిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చునని తెలిపారు. ప్రత్యేకించి యువత అతివేగంగా, ఫోన్లలో మాట్లాడుతూ వెళ్లడం వంటి కారణాలతో ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని వివరించారు. తల్లిదండ్రులు చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, అలా ఇవ్వడం చట్టరీత్యా నేరమని గుర్తుచేశారు. అదేవిధంగా వాహనదారులు రహదారి నియమాల పట్ల అవగాహన కలిగి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం బాధ్యతగా వ్యవహరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆత్మకూరు అర్బన, రూరల్‌ సీఐలు రాము, సురే్‌షకుమార్‌రెడ్డి, ఆయా పోలీసుస్టేషన్ల ఎస్సైలు నారాయణరెడ్డి, విష్ణునారాయణ, కేశవ, సురే్‌షకుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 12:03 AM