Share News

టీడీపీ హయాంలోనే పట్టణాభివృద్ధి : బీవీ

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:23 PM

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఎమ్మిగనూరు పట్టణాభివృద్ధి సాధ్యమైందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

టీడీపీ హయాంలోనే పట్టణాభివృద్ధి : బీవీ
బీవీ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

యూజీడీ పేరుతో పట్టణాన్ని గుంతలమయంగా మార్చారు

రివర్స్‌ టెండర్‌ పేరుతో జీడీపీ పైపులైన్‌ను ఆపేశారు

బీవీ సమక్షంలో టీడీపీలో చేరిన బనవాసి గ్రామస్థులు

లింగందిన్నెలో బీవీకి ఘన స్వాగతం

ఎమ్మిగనూరు, ఏప్రిల్‌26: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఎమ్మిగనూరు పట్టణాభివృద్ధి సాధ్యమైందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 24వ వార్డు నాగప్ప కట్టల ప్రాంతంతోపాటు 5,6,9,1621వ వార్డుల్లో టీడీపీ శ్రేణులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే సూపర్‌-6 పథకాలను వివరించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఐదేళ్లలో పట్టణంలో ఒక్క అభివృద్ధి పనికూడా జరగలేదన్నారు. 12ఏళ్ల క్రితం ప్రారంభించిన అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పథకం నేటికీ పూర్తికాలేదన్నారు. యూజీడీ పేరుతో పట్టణంలోని సీసీ రోడ్లన్నీ తవ్వి గుంతలమయంగా మార్చారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనేక ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశానని గుర్తుచేశారు. ఈ ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో అభివృద్దిని విస్మరించిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి బాటలువేయాలని కోరారు. టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ దయాసాగర్‌ , కౌన్సిలర్‌ రాందాసుగౌడు, మాజీ కౌన్సిలర్‌ రంగస్వామిగౌడ్‌, కటారి రాజేంద్ర, మీసేవా ఈశ్వర్‌, నాయకులు రాందాసుగౌడు, మిఠాయి నరసింహులు, రామకృష్ణనాయుడు, రంగస్వామిగౌడు, ముల్లాఖలీముల్లా, తురేగల్‌ నజీర్‌, గుల్లా సలాం, బిజ్జె నాగరాజు, భాస్కర్‌, సోములగూడూరు మాబాషా పాల్గొన్నారు.

బనవాసి గ్రామం నుంచి 30 కుటుంబాలు టీడీపీలో చేరిక

ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి స్వయాన అల్లుడు బిఆర్‌. బసిరెడ్డి స్వగ్రామమైన బనవాసి గ్రామం నుంచి 30 కుటుంబాలు బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. నాయకులు సురేష్‌, అబ్రహం, వీరనాగప్ప, రాజశేఖర్‌, గోపాల్‌, నరసింహులు, జగదీష్‌, లోకేష్‌ పాల్గొన్నారు.

లింగందిన్నెలో ఘనస్వాగతం

గోనెగండ్ల: మండల పరిధిలోని కున్నూరు, బోదేపాడు, తిప్పనూరు, వీరంపల్లి, లింగందిన్నె గ్రామాల్లో బీవీ జయనాగేశ్వరరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకు ముందు ఆయా గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ, ఊరేగింపు నిర్వహించారు. మేళ తాళాలు తప్పెట్లతో బాణ సంచ పేల్చుతూ బీవీకి ఘనస్వాగతం పలికారు. పలు కూడళ్లలో ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్క గ్రామంలో కనీసం ఒక్క రోడ్డు కూడా వేయలేదని, కనీసం గుంతలు పడ్డ రోడ్ల మర్మత్తు కూడా చేయలదని విమర్శించారు. అభివృద్ధిని విస్మరించిన జగన్‌ను ఇంటికి పంపేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలలో టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నజీర్‌సాహెబ్‌, తిరుపతయ్యనాయుడు, రమేష్‌నాయుడు, ఎర్రబాడు శ్రీనివాసులు, బేతాలబడేసా, నూరహమ్మద్‌, భారతం ర హంతుల్లా, ఫకృద్దీన్‌, రంగస్వామినాయుడు, టీ డీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నార,ు.

Updated Date - Apr 26 , 2024 | 11:23 PM