Share News

కొండెక్కిన కోడి ధర

ABN , Publish Date - May 21 , 2024 | 12:17 AM

కోడి మాంసం ధర కొండెక్కి కూర్చుంది. మొన్నటి వరకు కిలో రూ.200 నుంచి రూ.220 ఉన్న కోడి మాంసం ధర రూ.280 కు చేరింది.

కొండెక్కిన కోడి ధర

మద్దికెర, మే 20: కోడి మాంసం ధర కొండెక్కి కూర్చుంది. మొన్నటి వరకు కిలో రూ.200 నుంచి రూ.220 ఉన్న కోడి మాంసం ధర రూ.280 కు చేరింది. అదనంగా వారం రోజుల్లోనే రూ.60 పెరిగింది. ఎండల తీవ్రతతో గ్రామాల్లో కోళ్ల పెంపకం తగ్గిపోయింది. అదే సమయంలో కోడి పుంజులు చనిపోవడం, ఉత్పత్తి తగ్గిపోవడం, కొనుగోలు పెరగడం, ధరలకు కారణమైంది. మద్దికెర మండలానికి ఎక్కువగా బెంగుళూరు నుంచి కోళ్లు దిగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం మండలంలో అంతంత మాత్రంగా సరఫరా ఉండటంతో సుదూర ప్రాంతాల నుంచి కోళ్లు తెప్పించడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. మున్ముందు మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మటన్‌ మాంసం కేజీ రూ.700 చేరుకుంది. ధరలు పెరిగి పోవడంతో విక్రయాలు తగ్గిపోతున్నాయని వ్యాపారస్థులు చెబుతున్నారు.

Updated Date - May 21 , 2024 | 12:17 AM