Share News

అదుపులోకి రాని అతిసార వ్యాధి

ABN , Publish Date - Feb 13 , 2024 | 02:26 AM

గుంటూరులో అతిసార వ్యాధి బాధితులు పెరుగుతూనే ఉన్నారు. సోమవారం కూడా 35 మంది బాధితులు జీజీహెచ్‌లో చేరారు.

అదుపులోకి రాని అతిసార వ్యాధి

మరో 35 మంది ఆస్పత్రికి.. ఇద్దరి పరిస్థితి విషమం.. మణిపాల్‌కు తరలింపు

కలుషిత జలమే కారణం కావొచ్చన్న వైద్య ఆరోగ్య శాఖ

నిర్ధారణకు ల్యాబ్‌కు శాంపిల్స్‌ తరలింపు

గుంటూరు మెడికల్‌, ఫిబ్రవరి 12: గుంటూరులో అతిసార వ్యాధి బాధితులు పెరుగుతూనే ఉన్నారు. సోమవారం కూడా 35 మంది బాధితులు జీజీహెచ్‌లో చేరారు. దీంతో ఇప్పటివరకు ఆస్పత్రిలో చేరిన రోగుల సంఖ్య 75కు చేరింది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడలోని మణిపాల్‌ ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న 15 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మరోవైపు అతిసారం కేసుల తీవ్రతకు కలుషిత నీరే కారణమని వైద్య ఆరోగ్య అనుమానిస్తోంది. మనిషి మల, మూత్రాలతో కలుషితమైన వ్యర్థ జలాల్లో ఈకోలి బ్యాక్టీరియా దాగి ఉంటుంది. ఈవిధంగా కలుషితమైన నీటిని తాగితే తీవ్రమైన వాంతులు, విరేచనాలతో అతిసార కాటు వేస్తుంది. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో చికిత్స పొందుతున్న అతిసార బాధితులను సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య విద్య సంచాలకులు నరసింహం పరామర్శించారు. అనంతరం కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ కలుషిత జలాలే అతిసార ప్రబలేందుకు కాణమని భావిస్తున్నట్లు తెలిపారు. దీనిని నిర్ధారించేందుకు రోగుల నుంచి శాంపిల్స్‌ సేకరించి, పరీక్షల కోసం పంపినట్లు చెప్పారు. మరో 24 గంటల్లో ఈ నివేదిక అందుతుందన్నారు. కాగా, సోమవారం కూడా 35 మంది డయేరియా బాధితులు జీజీహెచ్‌లో చేరారు. దీంతో ఇప్పటివరకు ఆస్పత్రిలో చేరిన రోగుల సంఖ్య 75కు చేరింది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరింత మెరుగైన వైద్యం కోసం విజయవాడ సమీపంలోని మణిపాల్‌ ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న 15 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

Updated Date - Feb 13 , 2024 | 09:59 AM