Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

రిమాండుకు వెళ్లిన రెండ్రోజులకు.. అరెస్టుపై ప్రకటన?

ABN , Publish Date - Mar 03 , 2024 | 02:55 AM

పన్ను ఎగవేత కేసులో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు రిమాండ్‌ విధించి రెండురోజులు కావస్తోంది.

రిమాండుకు వెళ్లిన రెండ్రోజులకు.. అరెస్టుపై ప్రకటన?

మాజీ మంత్రి ప్రత్తిపాటి కుమారుడి అరె్‌స్టపై పోలీసుల తీరిది

విజయవాడ, మార్చి 2(ఆంధ్రజ్యోతి): పన్ను ఎగవేత కేసులో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు రిమాండ్‌ విధించి రెండురోజులు కావస్తోంది. ఇప్పుడు పోలీసు శాఖ ఈ కేసుకు సంబంధించిన వివరాలతో శనివారం ప్రకటన విడుదల చేసింది. ఎపీఎ్‌సడీఆర్‌ఐ డిప్యూటీ డైరెక్టర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో శరత్‌పై కేసు నమోదు చేశామని తెలిపింది. ‘అవెక్సా కంపెనీ బ్యాంకు ఖాతాల నుంచి ఎల్లో స్టోన్‌ ఎస్టేట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ డైరెక్టర్లు ప్రత్తిపాటి స్వాతి, ప్రత్తిపాటి వెంకాయమ్మ, ప్రత్తిపాటి ఎస్టేట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అదనపు డైరెక్టర్లు ప్రత్తిపాటి స్వాతి, ప్రత్తిపాటి శరత్‌, ప్రత్తిపాటి వెంకాయమ్మకు ఒక్కొక్కరికి రూ.10 కోట్లపైగా లావాదేవీలు జరిగినట్టు డీజీజీఐ గుర్తించింది. ఈ అక్రమాల్లో కంపెనీ మాజీ డైరెక్టర్‌ క్రియాశీలకంగా వ్యవహరించినట్టు తేలడంతో ప్రత్తిపాటి శరత్‌ను అరెస్టు చేశాం’ అని పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 03 , 2024 | 08:35 AM