హెచ్చెల్సీ వాటా 26.36 టీఎంసీలు
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:06 AM
తుంగభద్ర జలాశయంలో ఈ ఏడాది 172 టీఎంసీల నీటి లభ్యత ఉండవచ్చని బోర్డు అంచనా వేసింది. కర్ణాటక రాష్ట్రం.. హోస్పేట్‌లోని టీబీబోర్డు కార్యాలయంలో బోర్డు ఎస్‌ఈ శ్రీకాంతరెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశాన్ని నిర్వహించారు. అనంతపురం ఎస్‌ఈ రాజశేఖర్, కర్నూలు ఎల్లెల్సీ ఎస్‌ఈ రెడ్డిశేఖర్‌రెడ్డి, కర్ణాటక ఎల్‌బీఎంసీ ఎస్‌ఈ బసవరాజ్‌నాయక్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

టీబీ డ్యాంలో 172 టీఎంసీల నీటి లభ్యత
అంచనా వేసిన తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు
మూడు రాషా్ట్రల ఎస్‌ఈలతో సమావేశం
రాయదుర్గం, జూన 6: తుంగభద్ర జలాశయంలో ఈ ఏడాది 172 టీఎంసీల నీటి లభ్యత ఉండవచ్చని బోర్డు అంచనా వేసింది. కర్ణాటక రాష్ట్రం.. హోస్పేట్‌లోని టీబీబోర్డు కార్యాలయంలో బోర్డు ఎస్‌ఈ శ్రీకాంతరెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశాన్ని నిర్వహించారు. అనంతపురం ఎస్‌ఈ రాజశేఖర్, కర్నూలు ఎల్లెల్సీ ఎస్‌ఈ రెడ్డిశేఖర్‌రెడ్డి, కర్ణాటక ఎల్‌బీఎంసీ ఎస్‌ఈ బసవరాజ్‌నాయక్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నీటి లభ్యత అంచనాల ఆధారంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాషా్ట్రల వాటాను నిర్ణయించారు. 2024-25లో ముందస్తు రుతుపవనాల కారణంగా జలాశయానికి 172 టీఎంసీల నీరు చేరుతుందని అంచనా వేశారు. ఏపీ వాటాగా 53.953 టీఎంసీలను కేటాయించారు. అందులో ఫ్లోరేటా ప్రకారం హెచ్చెల్సీకి 26.368 టీఎంసీలు, ఎల్లెల్సీకి 19.472 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు 8.113 టీఎంసీల నీరు అందుతాయని అంచనా వేశారు. తెలంగాణ వాటా కింద 5.282 టీఎంసీల నీటిని ఆర్‌డీఎస్ కాలువ ద్వారా అందించాలని నిర్ణయించారు. కర్ణాటకకు 112.765 టీఎంసీల నీటిని కేటాయించారు. ఫ్లోరేటా ప్రకారం హెచ్చెల్సీకి 13.440 టీఎంసీలు, రాయబసవ కెనాల్‌కు 5.376 టీఎంసీలు, ఆర్డీఎస్ కెనాల్‌కు 1.912 టీఎంసీలు, ఎల్‌బీఎంసీకి 71.423 టీఎంసీలు అందించాలని నిర్ణయించారు. తుంగభద్ర జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీల. ఆరునెలల పాటు ఎగువ ప్రాంతాల్లో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని, నీటి లభ్యత ఆశాజనకంగానే ఉంటుందని భావిస్తున్నారు. 200 టీఎంసీలకుపైగా నీటి లభ్యత ఉంటే బచావత అవార్డు ప్రకారం కాలువలకు కేటాయించిన నీటిని అందించే అవకాశం ఉంటుందని బోర్డు అధికారులు తెలిపారు. హెచ్చెల్సీకి బచావత ట్రిబ్యునల్ 32.5 టీఎంసీల నీరు కేటాయించారు. కానీ ఈ ఏడాది నీటి లభ్యతను బట్టి 26.368 టీఎంసీలు ఇవ్వాలని నిర్ణయించారు. జూలై 20వ తేదీన హెచ్చెల్సీకి ఏపీ వాటా నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమావేశంలో తీర్మానం చేశారు. జలాశయంలోకి ముందుగానే నీరు చేరితే నిర్ణయించిన తేదీకంటే ముందే నీటిని విడుదల చేసే అంశాన్ని కూడా చర్చించారు.