కొనసాగుతున్న వరద
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:18 PM
ఆంధ్ర, కర్ణాటక జీవనాడి తుంగభద్ర జలాశయానికి 20.851 టీఎంసీల నీరు చేరింది. ఇనఫ్లో తగ్గింది. ఆదివారం 50,715 క్యూసెక్కులు ఉండగా సోమవారం ఉదయానికి 30,388 క్యూసెక్కులకు తగ్గింది.

టీబీ డ్యాంలో 20 టీఎంసీల నీరు
బొమ్మనహాళ్, జూలై 8: ఆంధ్ర, కర్ణాటక జీవనాడి తుంగభద్ర జలాశయానికి 20.851 టీఎంసీల నీరు చేరింది. ఇనఫ్లో తగ్గింది. ఆదివారం 50,715 క్యూసెక్కులు ఉండగా సోమవారం ఉదయానికి 30,388 క్యూసెక్కులకు తగ్గింది. ఔట్‌ఫ్లో 156 క్యూసెక్కులున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందస్తుగానే జలాశయం నుండి ఎగువ కాలువకు నీరు విడుదల అవుతాయన్న ఆశతో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.