వచ్చేస్తోంది.. వరద
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:52 PM
తుంగభద్ర జలాశయానికి ఎగువన మలెనాడు ప్రాంతంలో భారీ వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో శివమొగ్గ జిల్లా గాజిగనూరు సమీపంలోని తుంగ జలాశయం నిండిది.
టీబీ డ్యాంలోకి ఒకే రోజు 3 టీఎంసీలు
బళ్లారి గాంధీనగర్/రాయదుర్గం, జూలై 5: తుంగభద్ర జలాశయానికి ఎగువన మలెనాడు ప్రాంతంలో భారీ వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో శివమొగ్గ జిల్లా గాజిగనూరు సమీపంలోని తుంగ జలాశయం నిండిది. జలాశయం భద్రత దృష్ట్యా 15 క్రస్టుగేట్ల ద్వారా 40 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. భద్ర జలాశయానికి 4,098 క్యూసెక్కుల వరద చేరుతోంది. అదే ప్రాంతంలో లింగనమస్కి జలాశయానికి 60,238 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఈ వరద నీరు తుంగభద్ర జలాశయం దిశగా పరుగులు పెడుతోంది. తుంగ జలాశయం నుంచి తుంగభద్ర జలాశయానికి 100 కి.మీ. దూరం ఉంది. దీంతో ఈ వరద నీరు తుంగభద్ర జలాశయానికి చేరేందుకు 15 గంటల సమయం పడుతుంది. తుంగభద్ర జలాశయానికి శుక్రవారం సాయంత్రం 18,500 క్యూసెక్కుల వరద చేరుతోంది. శనివారానికి 50 వేల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉంది. జలాశయం నీటి నిల్వలు 12 టీఎంసీలకు చేరాయి. ఒకే రోజు మూడు టీఎంసీల నీరు చేరింది. గత ఏడాది ఇదే సమయానికి ఇనఫ్లో కేవలం 259 క్యూసెక్కులు కాగా, జలాశయంలో నీటి నిల్వలు 3.07 టీఎంసీలు ఉండేవని బోర్డు అధికారులు తెలిపారు.