Share News

ట్రైనీ డీఎస్పీ భవ్యకు సన్మానం

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:46 AM

జిల్లాలో శాంతిభద్రతల్లో శిక్షణ పూర్తి చేసుకుని గ్రౌహౌండ్స్‌లో శిక్షణకు వెళుతున్న ట్రైనీ డీఎస్పీ భవ్యకు గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆ శాఖ వీడ్కోలు పలికింది.

ట్రైనీ డీఎస్పీ భవ్యకు సన్మానం
ట్రైనీ డిఎస్పీ భవ్యకు జ్ఞాపికను అందిస్తున్న ఎస్పీ కేవీ మురళీకృష్ణ

అనకాపల్లి రూరల్‌, జూన్‌ 6: జిల్లాలో శాంతిభద్రతల్లో శిక్షణ పూర్తి చేసుకుని గ్రౌహౌండ్స్‌లో శిక్షణకు వెళుతున్న ట్రైనీ డీఎస్పీ భవ్యకు గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆ శాఖ వీడ్కోలు పలికింది. ఈమె 2022లో డీఎస్పీగా ఎంపికయ్యారు. అనంతపూర్‌లో పీటీసీ శిక్షణ పొంది ఫీల్డ్‌లో శిక్షణ పొందేందుకు అనకాపల్లి జిల్లాకు అదే సంవత్సరంలో వచ్చారు. అప్పటినుంచి ఆమె అనకాపల్లి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌, ఎలమంచిలి పోలీస్‌స్టేషన్‌ల్లో కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌హెచ్‌వో, సీఐ, డీఎస్పీ నిర్వహించే విధుల్లో శిక్షణ పొందారు. ఇందులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసులు, 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల బందోబస్తు విధుల్లో అంకితభావం, నిబద్ధతగా పనిచేసి ఎన్నికల్లో విధుల్లో కూడా శిక్షణ పొందారు. ఈమె శాంతిభద్రతల విభాగంలో ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని గ్రౌహౌండ్స్‌ విభాగంలో శిక్షణ పొందేందుకు వెళుతున్న సందర్భంగా ఎస్పీ కేవీ మురళీకృష్ణ సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ విజయభాస్కర్‌, ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 12:46 AM