Share News

రెవెన్యూ శాఖలో బదిలీలు

ABN , Publish Date - Sep 21 , 2024 | 11:34 PM

రెవెన్యూ శాఖలో పలువురు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్వోలు శనివారం బదిలీ అయ్యారు.

రెవెన్యూ శాఖలో బదిలీలు

కర్నూలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 21: రెవెన్యూ శాఖలో పలువురు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్వోలు శనివారం బదిలీ అయ్యారు. కర్నూలు అర్బన తహసీల్దార్‌గా పని చేస్తున్న రామానుజనమ్మను దేవనకొండకు, పత్తికొండ తహసీల్దార్‌గా ఉన్న వెంకటలక్ష్మిని కర్నూలు అర్బన తహసీల్దార్‌గా, పత్తికొండ ఆర్డీవో కార్యాలయంలో డీఏవోగా పని చేస్తున్న సతీష్‌ను హొళగుంద తహసీల్దార్‌గా నియమించారు. అంతకముందు హొళగుంద తహసీల్దార్‌గా పని చేస్తున్న ప్రసాద్‌ రాజును పత్తికొండ ఆర్డీవో కార్యాలయం డీఏవోగా మార్చారు. సీసీఎల్‌ఏలో పని చేస్తున్న శ్రీనివాసరెడ్డిని సి.బెళగల్‌ తహసీల్దార్‌గా, ఇక్కడ పని చేసిన విజయశ్రీని కలెక్టరేట్‌ ఏవోగా నియమించారు. నంద్యాల జిల్లా నుంచి ఓర్వకల్లు తహసీల్దార్‌గా విద్యాసాగర్‌ నియమితులయ్యారు. కలెక్టరేట్‌ ఏవోగా పని చేస్తున్న రాజేశ్వరిని డీఆర్వో సెక్షనలో సూపరింటెండెంట్‌గా, అంతకముందు ఈ స్థానంలో యోగేశ్వరిదేవిని తుగ్గలి తహసీల్దార్‌గా నియమించారు. వీరితోపాటు 42 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 12 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులు బదిలీ అయ్యారు. నంద్యాల నుంచి కర్నూలుకు 15 మంది, కర్నూలు నుంచి నంద్యాలకు 13 మందికి స్థాన చలనం జరిగింది.

Updated Date - Sep 21 , 2024 | 11:34 PM