రీసైకిల్ ప్లాస్టిక్‌లో విష రసాయనాలు
ABN , Publish Date - Mar 06 , 2024 | 03:26 AM
రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో విషపూరితమైన రసాయనాలు అధికంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

న్యూఢిల్లీ, మార్చి 5: రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో విషపూరితమైన రసాయనాలు అధికంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఢిల్లీలోని ‘టాక్సిక్ లింక్స్’ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ‘ఎలాంటి నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వాడకం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్లాస్టిక్‌లో విషపూరితమైన రసాయనాలు ఉంటున్నాయి’ అని మంగళవారం విడుదలైన తాజా అధ్యయనం పేర్కొంది. అధ్యయనంలో భాగంగా మార్కెట్‌లో విరివిగా లభించే 15 రకాల ప్లాస్టిక్ వస్తువుల నమూనాలను పరిశీలించిన పరిశోధకులు.. వాటిలో 60 శాతానికిపైగా విష రసాయనాలు ఉన్నాయని గుర్తించినట్టు వెల్లడించారు.