Share News

ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌ ఎన్నికపై హైకోర్టుకు

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:35 AM

కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌(ఈపీ) పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌, రిటర్నింగ్‌ అధికారి, మరో 16మందికి

ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌ ఎన్నికపై హైకోర్టుకు

ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ పిటిషన్‌

అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌(ఈపీ) పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌, రిటర్నింగ్‌ అధికారి, మరో 16మందికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. విచారణను ఆగస్టు 27కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.శ్రీనివాస్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జనసేన పార్టీ నుంచి కాకినాడ ఎంపీగా విజయం సాధించిన తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ జి.పొట్టియ్య హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో విద్యార్హతను తప్పుగా పేర్కొన్నారని, అతనికి ఉన్న రెండు పాన్‌ కార్డులలో ఒకదాని వివరాలే వెల్లడించారని, ఆర్వోను ప్రభావితం చేసి ఇతర ఎంపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించేలా చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఉదయ్‌ శ్రీనివా్‌సను అనర్హుడిగా ప్రకటించి, ఆయన ఎంపీ పదవిని రద్దు చేయాలని కోరారు.

Updated Date - Jul 26 , 2024 | 07:21 AM