Share News

పెద్దిరెడ్డి బానిసలకే టికెట్లు: గాంధీ

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:02 AM

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బానిసలుగా ఉండేవారికే ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు వస్తాయి తప్ప నిజాయతీగా ఉండేవారికి దక్కవు’’ అని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు ఆర్‌. గాంధీ ఆరోపించారు.

పెద్దిరెడ్డి బానిసలకే టికెట్లు: గాంధీ

చిత్తూరు, ఫిబ్రవరి 5: ‘‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బానిసలుగా ఉండేవారికే ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు వస్తాయి తప్ప నిజాయతీగా ఉండేవారికి దక్కవు’’ అని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు ఆర్‌. గాంధీ ఆరోపించారు. చిత్తూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘వైసీపీలో దళితులకు న్యాయం జరగడం లేదు. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి దళితులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను 12 ఏళ్లకు ముందు మాజీ మంత్రి అమరనాథరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాను. నన్ను కాదని పార్టీలో చేరతావా అంటూ పెద్దిరెడ్డి నాటి నుంచి నన్ను పక్కన పెట్టారు. సీఎం జగన్‌ను కలిసి దళితుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళతామంటే ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదు. పెద్దిరెడ్డి దళితుల పట్ల చూపుతున్న వివక్షపై పార్టీలో ఉండీ పోరాడలేకపోతున్నా. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నా’’ అని గాంధీ అన్నారు. చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డెప్ప మంత్రి పెద్దిరెడ్డి ముందు కనీసం కూర్చోలేరన్నారు. తాను మంగళవారం చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో జరిగే చంద్రబాబు ‘రా కదలిరా!’ సభలో టీడీపీలో చేరుతున్నట్టు వెల్లడించారు.

Updated Date - Feb 06 , 2024 | 04:02 AM