Share News

టీడీపీ వర్గీయులపై మూడు కేసుల నమోదు

ABN , Publish Date - May 14 , 2024 | 11:34 PM

దర్శి మండలంలో పోలింగ్‌ సందర్భంగా జరిగిన ఘటనలపై మంగళవారం పోలీసులు ఏకపక్షంగా టీడీపీ వర్గీయులపై మూడు కేసులు బనాయించారు. బొట్లపాలెంలో వైసీపీ మూక టీడీపీ వారిపై దాడి చేసి గాయపరిచారు. టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి బాధితులను అండగా నిలిచేందుకు అక్కడకెళ్లి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా నిరసన తెలిపారు. పోలీసులు దాడులు చేసిన వారిని పక్కనబెట్టి ధర్నా చేశారన్న నెపంతో ఆమెతోపాటు మరికొందరుపై కేసు నమోదు చేశారు.

టీడీపీ వర్గీయులపై మూడు కేసుల నమోదు
వైసీపీ దాడిలో తలపగిలిన కార్యకర్త

దర్శి కూటమి అభ్యర్థిపై రెండు.. ఇంకొకటి మరొక కార్యకర్తపై

బాధితులపైనే రివర్స్‌ కేసులు

దర్శి , మే 14 : మండలంలో పోలింగ్‌ సందర్భంగా జరిగిన ఘటనలపై మంగళవారం పోలీసులు ఏకపక్షంగా టీడీపీ వర్గీయులపై మూడు కేసులు బనాయించారు. బొట్లపాలెంలో వైసీపీ మూక టీడీపీ వారిపై దాడి చేసి గాయపరిచారు. టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి బాధితులను అండగా నిలిచేందుకు అక్కడకెళ్లి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా నిరసన తెలిపారు. పోలీసులు దాడులు చేసిన వారిని పక్కనబెట్టి ధర్నా చేశారన్న నెపంతో ఆమెతోపాటు మరికొందరుపై కేసు నమోదు చేశారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో టీడీపీ నేత వీసీరెడ్డిపై దాడి చేసిన వారిని వదిలేసి ఈవీఎం పగులగొట్టాడని పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. దర్శి-కురిచేడు రోడ్డులోని ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించేందుకు అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిని అకారణంగా అడ్డుకుని కారుపై రాళ్లతో దాడి చేశారు. ఆమెను రక్షించేందుకు టీడీపీ వర్గీయులపై ఎదురుతిరిగారు. టీడీపీ వర్గీయులపై పోలీసులు లాఠీచార్జి చేసి వారే రాళ్లు రువ్వారని దర్శి పట్టణ మాజీ అధ్యక్షుడు దారం సుబ్బారావు మరికొందరుపై కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా జరిగిన మూడు సంఘటనలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

Updated Date - May 14 , 2024 | 11:34 PM