Share News

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

ABN , Publish Date - Mar 27 , 2024 | 02:20 AM

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళకు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు.

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

కర్నూలు(హాస్పిటల్‌), మార్చి 26: కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళకు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన సుష్మారాణి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పని చేస్తోంది. ఆమె పురిటి నొప్పులతో ఈ నెల 6వ తేదీన కర్నూలు జీజీహెచ్‌లో చేరింది.యూనిట్‌ చీఫ్‌ డా.సావిత్రి సుధాకర్‌ పరీక్షలు నిర్వహించి, బీపీ ఎక్కువ కావడంతో 15 రోజులుగా వార్డులోనే ఉంచి చికిత్స అందించారు. ఈ నెల 19వ తేదీ వైద్యు బృందం సుష్మారాణికి సిజేరియన్‌ చేశారు. ముగ్గురు శిశువుల్లో ఆడ శిశువు 1.9 కిలోలు, మగపిల్లల్లో ఒకరు 1.5 కిలోలు, మరొకరు 1.9 కిలోలు ఉన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 02:20 AM